»   » 70శాతం గట్టెక్కింది... నాగార్జున చాలానే కష్టపడుతున్నాడు.

70శాతం గట్టెక్కింది... నాగార్జున చాలానే కష్టపడుతున్నాడు.

Posted By:
Subscribe to Filmibeat Telugu

రెండేళ్ల క్రితం చిన్న సినిమాగా విడుదలై.. మంచి విజయాన్ని అందుకున్న చిత్రం 'రాజుగారి గది'.చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న 'రాజుగారి గది' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం 'రాజుగారి గది 2'. ఒయాక్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీ రోల్ లో కనిఒపించనున్నాడు.

ఒయాక్ ఎంటర్ టైన్మెంట్స్, పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమంత కీలకపాత్రను పోషిస్తున్న ఈ మూవీ తాజాగా థర్డ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. నాగార్జున, సీనియర్‌ నరేశ్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

Omkar's Raju Gari Gadhi 2 Completes Third Schedule

''పాండిచ్చేరిలో 20 రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌తో దాదాపు 70 శాతం టాకీ పార్ట్‌ పూర్తయింది. నాగార్జున, నరేష్‌, సమంత, సీరత్‌ కపూర్‌, సీనియర్‌ నరేష్‌ల నడుమ కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ముఖ్యంగా నాగార్జున ఇందులో మరింత అందంగా కనిపిస్తున్నారని అందరూ వ్యాఖ్యానిస్తుండడం విశేషం. సీరత్‌ పాత్ర చాలా కీలకం, ఆమెకు లభించిన ఈ క్యారెక్టర్‌ ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలవడం ఖాయం'' అని చెప్తోంది చిత్ర యూనిట్

పాండిచ్చేరిలో 20 రోజులపాటు జరిపిన తాజా షెడ్యూల్‌తో ఈ మూవీ 70 శాతం వరకూ చిత్రీకరణ పూర్తయినట్టు నిర్మాతలు తెలియజేశారు. పాండిచ్చేరి షెడ్యూల్‌లో నాగార్జున, నరేశ్, సమంత, సీనియర్ నరేశ్ నడుమ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న హీరోయిన్ సీరత్ కపూర్.కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందని నిర్మాతలు ఆకాంక్షించారు. మరి.. 'రన్ రాజా రన్' తరహా మరో విజయాన్ని ఈ మూవీ సీరత్‌కు అందిస్తుందేమో చూడాలి..!

English summary
director Ohmkar of OAK Entertainment joined hands with PVP Cinema and Matinee Entertainments is progressing rapidly with Raju Gari Gadhi 2 shooting schedules. Ohmkar and his unit finished a 20 days pivotal third schedule in Pondicherry with whole cast, crew.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu