»   »  ఓంకార్ అన్నయ్య... 'రాజుగారి గది' ట్రైలర్ (వీడియో)

ఓంకార్ అన్నయ్య... 'రాజుగారి గది' ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'రాజుగారి గది'లో ఏముందో తెలుసుకోవాలని అటు సినీ ప్రేక్షకులే కాదు.. తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీనియస్‌ చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన ఓంకార్‌ తన తదుపరి యత్నంగా రూపొందిస్తున్న చిత్రం 'రాజు గారి గది'. వినాయక చవితి సందర్భంగా చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.


ఓంకార్ గతంలో డైరక్ట్ చేసిన జీనియస్ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ నేఫధ్యంలో ఆయన గ్యాప్ తీసుకుని ఈ కథలో లో బడ్జెట్ లో ఓ చిత్రం ప్లాన్ చేసుకుని వస్తున్నారు. ఈ చిత్రంలో ఓంకార్ సోదరుడు అశ్విన్ హీరోగా నటించనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కామెడీ ధ్రీల్లర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే షూటింగ్ పూర్తైందని చెప్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఓంకార్ పూర్తి కాన్సర్టేషన్ తో రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం హర్రర్, థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ నడుస్తూండటంతో సినిమా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

Omkar's Raju Gari Gadhi Movie Trailer

తేజస్విని మాట్లాడుతూ..... 'ఐస్‌ క్రీమ్‌' కంటే ముందే ఓ సినిమాలో చేశా. ఓంకార్‌ సోదరుడు ఇందులో హీరోగా నటించారు. ఇదో రోడ్‌ జర్నీకి సంబంధించిన కథ. నా పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుంది. సినిమా మొత్తమ్మీద ఒక్కసారి కూడా నవ్వను. తమిళంలో ఒక సినిమా చేస్తున్నా అని చెప్పింది.

ఇంతకుముందు ఈ చిత్రం ప్రోమోను ఆసక్తి కల్గించేలా రూపొందించి తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో వెంకటేశ్‌, నాని, శ్రీకాంత్‌, సందీప్‌ కిషన్‌, తరుణ్‌, నిఖిల్‌తోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు తళుక్కున మెరిశారు. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.

English summary
TV host Omkar is coming up with a new film “Raju Gaari Gadhi”. Trailer featuring Ashwin Babu, Dhanya Balakrishna. Directed by Ohmkar exclusively on OAK Entertainments. Raju Gari Gadi movie also stars Chetan, Eshanya, Poorna, Posani Krishna Murali, Raghu Babu, Rajeev Kanakala, Pavithra Lokesh, Saptha Giri, Prabhas Srinu, Dhanraj, Shakalaka Shankar. Music composed by Sai Kartheek and Produced by OAK Entertainments Pvt Ltd.
Please Wait while comments are loading...