»   » అక్షయ తృతీయ: నటుడు వివేక్ ఒబెరాయ్‌కు బంపర్ ఆఫర్

అక్షయ తృతీయ: నటుడు వివేక్ ఒబెరాయ్‌కు బంపర్ ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హిందువులకు పవిత్రమైన అక్షయ తృతీయ రోజు వివేక్ ఓబెరాయ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డను ఆశీర్వదించాలని వివేక్ ట్విట్టర్ లో మనవి చేశారు.

జేడీ(యు) నాయకుడు దివంగత జీవరాజ్ అళ్వ కుమార్తె ప్రియాంక అళ్వను వివేక్ ఓబెరాయ్ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి ఈ బాలివుడ్ హీరో కర్ణాటక అల్లుడు అయ్యాడు. 2013లో వివేక్ ఒబెరాయ్, ప్రియాంక దంపతులకు మగబిడ్డ పుట్టాడు.

Vivek Oberoi

మంగళవారం మహాలక్ష్మికి ఇష్టం అయిన అక్షయ తృతీయ రోజు బెంగళూరు నగరంలోని ప్రసిద్ది చెందిన ఆసుపత్రితో ప్రియాంక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రియాంక కుటుంబ సభ్యులు, వివేక్ ఓబెరాయ్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి చేరుకుని చిన్నారితో సంతోషంగా గడిపారు.

ప్రియాంక అళ్వ, ఆమె కుమార్తె ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. మొత్తం మీద వివేక్ ఓబ్రాయ్ మంచి చాన్స్ కొట్టేశాడని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన రక్తచరిత్ర-1, రక్తచరిత్ర-2 చిత్రాలలో వివేక్ ఓబెరాయ్ నటించాడు.

English summary
On Akshya Tritiya is a very lucky day for Vivek Oberoi and his family. That’s because Vivek and his wife Priyanka have been blessed with a baby girl. Priyanka has delivered the baby in Bangalore which is her home town.
Please Wait while comments are loading...