Don't Miss!
- Finance
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు.. సంక్షేమంలో ముందుకే..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- News
అమరావతి కేసు విచారణ-సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ? ఫాస్ట్ ట్రాక్ విజ్ఞప్తి, ఫిర్యాదుల నేపథ్యం !
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Sports
SA20 : దంచికొట్టిన సన్రైజర్స్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన క్యాపిటల్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి మరో ఝలక్ .. ఏపీలో విడుదల ఆపేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు!
అంతా ఆసక్తిగా ఎదురుచూసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రాలో విడుదల కాలేదు. తెలంగాణ, యూఎస్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఆంధ్ర హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్టే విధించిన సంగతి తెలిసిందే. కోర్టు సమస్యలు తీరాక ఈ చిత్రం ఆంధ్రాలో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చిత్రని మే 1 న ఆంధ్రలో విడుదల చేయనున్నట్లు వర్మ ఇటీవల ప్రకటించారు. ఈ చిత్ర ప్రచారం కోసం విజయవాడలో మీడియా సమావేశానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మరో షాక్ తగిలింది.

అడ్డుకున్న పోలీసులు
ఇటీవల రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో మే 1న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. విజయవాడలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. కానీ పోలీసులు ఆర్జీవీ ప్రెస్ మీట్ కు అంగీకరించలేదు. ఈ విషయంలో వర్మకు, పోలీసులకు మధ్య పెద్ద వివాదమే జరిగింది. కారణం కూడా చెప్పకుండా తమ మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారని వర్మ పోలీసులపై ఆరోపణలు చేశారు.

షాకిచ్చిన ఎన్నికల సంఘం
మీడియా సమావేశాన్నే అడ్డుకోవడంతో ఇక సినిమా ఏం విడుదలవుతుందనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. అనుమానాలకు తగ్గట్లుగానే ఎన్నికల సంఘం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనితో కోర్టు ఆ చిత్ర విడుదలపై స్టే విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆపేయాలంటూ ఏప్రిల్ 10న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు పంపింది.

కలెక్టర్లకు ఆదేశాలు
ఏపీలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మే 1న విడుదల చేయనునట్లు ఆర్జీవీ ప్రకటించారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలని అడ్డుకుంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జరీ చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి ఇంకా తదుపరి ఉత్తర్వులు అందలేదని, కాబట్టి ఆ చిత్రాన్ని విడుదలకు అనుమంతించడం కుదరదని పేర్కొంది. ఏపీలో ఎక్కడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల కాకుండా చూడాలని కలెక్టర్లని ఎన్నికల సంఘం ఆదేశించింది.

పెద్ద వివాదంగా
లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి, దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం న్యాయపోరాటంలో ఎంతవరకు అయినా వెళతాం అని ప్రకటించారు. ఎన్నికల సంఘం ప్రకటనతో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మరో సారి బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే ఈ చిత్రం తెలంగాణాలో విడుదలైపోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వర్మ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ చూపించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.