»   » నా బెస్ట్‌ సెల్ఫీ చూశారా? ఇదే‌: అల్లు అర్జున్‌ (ఫొటో)

నా బెస్ట్‌ సెల్ఫీ చూశారా? ఇదే‌: అల్లు అర్జున్‌ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ ‌: ఇవి సెల్ఫీల రోజుల. నలుగురు కలిస్తే...టక్కున ఓ సెల్పీ తీసేసుకుంటున్నారు. అలాంటి తాజాగా అల్లు అర్జున్ ఓ సెల్ఫీ తీసుకున్నారు. అదే బెస్ట్ సెల్ఫీ అంటున్నారు. ఆ సెల్ఫీ ఏమిటనేది మీరు ఈ క్రింద చూడవచ్చు. తాజాగా అల్లు అర్జున్‌.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను కలిశారు. కేవలం కలవడమే కాదు ఆయనతో సెల్ఫీ దిగి అభిమానులతో పంచుకున్నారు.

'నేను దిగిన ఉత్తమమైన సెల్ఫీల్లో ఇదీ ఒకటి. లెజండరీ ఆటగాడు. ఆయనతో కలిసి బెంగళూరు బ్లాస్టర్స్‌ జట్టు సహ యజమానిగా వ్యవహరిస్తున్నందుకు గౌరవంగా ఉంది' అని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలో పుల్లెల గోపీచంద్‌, చాముండేశ్వరీనాథ్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ తదితరులు కూడా ఉన్నారు.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం హరీశ్‌శంకర్‌ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథ్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'సరైనోడు' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత అల్లు అర్జున్‌ నటించే సినిమా పట్ల అందరికీ ఆసక్తి ఎక్కువైంది. అందుకు తగ్గట్టే ఆయన కొంత సమయం తీసుకుని మంచి స్ర్కిప్టులను ఎంచుకునే పనిలో పడ్డారు. ఎట్టకేలకు దిల్‌ రాజు నిర్మాణంలో, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆ సినిమా పేరు 'దువ్వాడ జగన్నాథం (డీజే)'. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

English summary
Allu Arjun shared in FB: One of my Best selfies ! Legendary Sports men ! Great Honour being associated & Co-owners of the Team #BengaluruBlasters"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu