»   » గుర్తుపట్టడమే కష్టం : స్టార్ హీరో షాకింగ్ లుక్

గుర్తుపట్టడమే కష్టం : స్టార్ హీరో షాకింగ్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సినిమా రంగంలో నెలకొన్న పోటీ వాతావరణం నేపథ్యంలో కథకు, క్యారెక్టర్‌కు తగిన విధంగా తన లుక్ మార్చుకోవడానికి హీరోలు/హీరోయిన్లు ఎంత కష్టానికైనా, ఎలాంటి మార్పులకైనా వెనకావడటం లేదు. నెలల తరబడి కష్టపడి సినిమాకు కావాల్సినట్లుగా తమ రూపాన్ని మార్చుకుంటున్నారు. మిస్టర్ పర్ ఫెక్షనిస్టులుగా పేరు తెచ్చుకోవడానికి శక్తిమేర ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల విడుదలైన భాగ్ మిల్ఖా భాగ్ చిత్రంలో పాత్ర కోసం దాదాపు 18 నెలలు కష్టపడి తన బాడీకి ప్రత్యేకమైన రూపుతెచ్చుకున్నాడు నటుడు పర్హాన్ అక్తర్. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం తన నటింబచోయే 'మద్రాస్ కేఫ్' చిత్రం కోసం ఎవరూ గుర్తు పట్టని విధంగా షాకింగ్ లుక్‌లోకి మారాడు.

ఆకట్టుకునే లుక్‌తో ఎంతో మందికి రోల్ మోడల్‌గా ఉండే జాన్ అబ్రహం ఇలా భయంకరుడిగా కనిపించడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే సినిమా పాత్రలో పర్ ఫెక్షన్ కోసమే ఈ లుక్ అని అంటున్నాడట జాన్. సినిమా చూసిన తర్వాత ఇలాంటి లుక్ ఎంత అవసరమో అందరికీ అర్థమవుతుందట.

కాగా బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'మద్రాస్ కేఫ్' చిత్రంలో జాన్ అబ్రహం raw ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సూజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. జాన్ అబ్రహంకు జోడీగా నర్గీస్ ఫక్రి నటిస్తోంది. 1990ల్లో సాగిన శ్రీలంక సివిల్ వార్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో పొలిటికల్ స్పై థ్రిలర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

English summary
Bollywood hunk John Abraham, who has reportedly transformed himself so much for his upcoming movie Madras Cafe, that he seems unrecognisable. In fact, even his diehard fans wouldn't be able to recognise him in this new avatar! As per reports, John Abraham is all set to play the role of a raw agent in Madras Cafe.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu