twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరికి అంతర్జాతీయ మార్కెట్ లో అరుదైన గౌరవం..!

    By Sindhu
    |

    'సినిమా ఇండస్ట్రీలోని పరిస్థితులకు అద్దం పడుతూ రవితేజతో పూరి జగన్నాథ్ చేసిన 'నేనింతే" కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినప్పటికీ దర్శకుడుగా అతనికి మంచి పేరు తెచ్చింది. కొన్ని కాలేజిల్లో స్టూడెంట్స్ కి ఈ సినిమా చూపించి ఫ్యూచర్ లో వారి కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది లెసన్ గా చెప్పారట. పూరి ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆస్కార్ వరకూ వెళ్ళిపోయాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పూరి చేసిన 'బుడ్డా..హోగా తేరా బాప్" చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే..ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది. కమర్షియల్ గా ఎంత వర్కవుట్ అయింది అనేది పక్కన పెడితే పూరికి ఓ అరుదైన గౌరవం దక్కింది.

    ఆస్కార్ అవార్డ్స్ కి సంబంధించిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్, లాస్ ఏంజిల్స్ వారు 'బుడ్డా హోగా తేరా బాప్" స్ర్కిప్ట్ ని ఆస్కార్ లైబ్రరీలో భద్రపరచబోతున్నారు. గతంలో కూడా కొన్ని హిందీ సినిమాల స్క్రిప్ట్స్ ఆస్కార్ లైబ్రరీలో వుంచడం జరిగింది. ఒక తెలుగు దర్శకుడికి ఈ గౌరవం దక్కడం ఇదే ప్రథమం. ఈ విషయం తెలుసుకున్న బిగ్ బి పూరి జగన్నాథ్ ని అభినందించాడు.

    English summary
    Tollywood director Puri gets demand in international market, Oscar Library requests Puri’s Buddah Hoga Tera Baap story script.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X