»   »  ఆస్కార్‌లో ట్రంప్‌ అలజడి.. ఐదు నిమిషాల్లోనే లక్షమంది రీట్వీట్

ఆస్కార్‌లో ట్రంప్‌ అలజడి.. ఐదు నిమిషాల్లోనే లక్షమంది రీట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమెరికాలో వలసదారులపై ఆంక్షలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో నిరసన వెల్లువెత్తింది. ఏడు ముస్లిం దేశాల ప్రజలను దేశంలోకి రాకుండా అడ్డుకునేందుకు జారీ చేసిన 'ప్రయాణ నిషేధ' ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పలువురు సినీ తారలు బ్లూ రిబ్బన్ ధరించి వచ్చారు.

 ట్రంప్ ట్వీట్ చేయలేదు.. ఆందోళనగా..

ట్రంప్ ట్వీట్ చేయలేదు.. ఆందోళనగా..

అకాడమీ అవార్డుల కార్యక్రమ వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్‌ కూడా ట్రంప్‌పై తన వ్యతిరేకతను వేదికపైనే చూపించారు. ‘అస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఫ్రారంభమై రెండు గంటలు దాటింది. ట్రంప్ ఇంకా ఏం ట్వీట్‌ చేయలేదు, చాలా ఆందోళనగా ఉంది' అంటూ ట్రంప్‌పై జిమ్మీ సెటైర్లు వేశారు.

 వేదికపైనే ట్రంప్ పై సెటైర్లు

వేదికపైనే ట్రంప్ పై సెటైర్లు


ట్రంప్ తరచూ ట్వీట్లు చేసే అలవాటును గుర్తుచేశారు. ఓ దశలో జిమ్మీ ఫోన్‌ తీసుకుని ‘హే డొనాల్డ్‌ ట్రంప్‌ యు అప్‌?' అని ట్వీట్‌ చేశారు. జిమ్మీ ట్వీట్‌ను దాదాపు రెండు లక్షల మంది రీట్వీట్‌ చేశారు.

 పౌరహక్కులకు సినీతారల మద్దతు

పౌరహక్కులకు సినీతారల మద్దతు


అమెరికా పౌర హక్కుల సంఘం (ఏసీఎల్యూ) చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలిచారు. సినీతార రూత్ నెగ్గా, మూన్ లైట్ దర్శకుడు బెర్రీ జెంకిన్స్, కెర్లీ క్లోస్, కాసీ అఫ్లెక్, మెంజ్ పాసెక్, లిన్ మాన్యుయెల్ మిరిండా తదితరులు బ్లూ రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేశారు.

 మెరిల్ స్ట్రిప్‌కు ఆస్కార్ బాసట

మెరిల్ స్ట్రిప్‌కు ఆస్కార్ బాసట


అమెరికా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన నటి మెరిల్‌ స్ట్రీప్‌ను గతంలో ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా మెరిల్‌కు జిమ్మీ మద్దతుగా నిలిచారు. ‘మెరిల్‌ సేస్‌ హాయ్‌' హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్వీట్‌ చేశారు.

English summary
Oscars host Jimmy Kimmel Taunts Donald Trump In Political Oscars Opening Monologue. Kimmel opens the Academy Awards show with digs at the president and the political division in the US
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu