Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
OTT Releases this week.. వర్షిణి సౌందర్‌రాజన్, దీపిక పదుకోన్, ప్రియమణి సినిమాల హంగామా.. ఈ వారం రిలీజ్‌లు ఇవే..
దేశ వినోద పరిశ్రమలో ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్స్ రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్నది. థియేట్రికల్ రిలీజ్‌తోపాటు స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోలతో కూడిన భారీ చిత్రాలు ఓటీటీ ద్వారా ఫిబ్రవరి 11, 12 తేదీల్లో రిలీజ్ కానున్నాయి. దీంతో ప్రేక్షకులు ఆసక్తిగా క్రేజీ చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. రానున్న వారం రోజుల్లో ఓటీటీ ద్వారా రిలీజ్ కాబోతున్న చిత్రాల వివరాల్లోకి వెళితే..

విక్రమ్ నటించిన మహాన్ అమెజాన్ ప్రైమ్‌లో
తమిళ సూపర్ స్టార్, చియాన్ విక్రమ్ నటించిన మహాన్ చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో విక్రమ్‌తోపాటు తన కుమారుడు ధ్రువ్ కూడా కలిసి నటించడం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ అవుతున్నది.

దీపిక పదుకోన్ గెహ్రాయియాన్ అమెజాన్‌లో
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్, అనన్య పాండే నటించిన గెహ్రాయియాన్ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్దమైంది. సిద్దార్థ్ చతుర్వేది, ధైర్య కర్వా లాంటి తారలు నటిస్తున్న గెహ్రాయియాన్ చిత్రాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తుండగా, షకున్ బాత్రా దర్వకత్వం వహిస్తున్నారు. గెహ్రాయియాన్ చిత్రం ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతున్నది. దాదాపు 240 దేశాల్లో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.

రక్తాంచల్ సీజన్ 2 వెబ్ సిరీస్
హిందీ వెబ్ సిరీస్ రక్తాంచల్ 2 రెండో సీజన్ రిలీజ్‌కు సిద్ధమైంది. నిఖ్తిన్ ధీర్, క్రాంతి ప్రకాశ్ ఝా, మెహీ గిల్, ఆశీష్ విద్యార్థి, కరణ్ పటేల్, సౌందర్య శర్మ నటించిన ఈ చిత్రానికి రితమ్ శ్రీవాస్తవ్ దర్శకత్వం వహించారు. పగ, ప్రతీకారం, భావోద్వేగాలతో కూడిన ఈ వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం ఫిబ్రవరి 11వ తేదీన మ్యాక్స్ ఒరిజినల్‌లో స్ట్రీమింగ్ కానున్నది.

ప్రియమణి భామాకలాపం ఆహాలో
ఇక
ప్రియమణి
నటించిన
భామా
కలాపం
ఓటీటీ
రిలీజ్
అవ్వడానికి
సిద్ధంగా
ఉంది.
కామెడీ,
క్రైమ్,
థ్రిల్లర్‌గా
రూపొందింది.
భామా
కలాపం
సినిమాలో
ప్రియమణి
వంటల
కార్యక్రమాన్ని
నిర్వహించే
హోస్ట్‌గా
కనిపించనున్నారు.
ఈ
చిత్రంలో
అనుపమ
పాత్రలో
నటించారు.
క్రిమినల్
ఇన్వెస్టిగేషన్‌తో
సాగే
కామెడీ
థ్రిల్లర్‌గా
రూపొందింది.
ఈ
చిత్రానికి
అభిమన్యు
తాడిమెట్
దర్శకత్వం
వహిస్తున్నారు.
జస్టిన్
ప్రభాకర్
సంగీతం,
దీపక్
యెరగెరా
సినిమాటోగ్రఫిని
అందిస్తున్నారు.
ఈ
చిత్రం
ఆహా
ఓటీటీలో
ద్వారా
ఫిబ్రవరి
12
రోజున
స్ట్రీమింగ్
కానున్నది.

వర్షిణి సౌందర్‌రాజన్ మళ్లీ మొదలైంది..
టాలీవుడ్
హీరో
సుమంత్,
నైనా
గంగూలి,
వర్షిణి
సౌందర్‌రాజన్
నటించిన
మళ్లీ
మొదలైంది.
ఈ
చిత్రానికి
టీజీ
కీర్తీ
కుమార్
దర్శకత్వం
వహించారు.
ఈ
చిత్రాన్ని
ఓటీటీ
ద్వారా
ప్రేక్షకుల
ముందుకు
తీసుకొస్తున్నారు.
ఈ
చిత్రాన్ని
జీ5
ఓటీటీలోలో
ఫిబ్రవరి
12వ
తేదీన
స్ట్రీమింగ్
కానున్నది.