»   »  ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాం, మహేష్ వల్లే పైసా: శ్రీమంతుడుపై రాజమౌళి

ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాం, మహేష్ వల్లే పైసా: శ్రీమంతుడుపై రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' సినిమాను శుక్రవారం సాయంత్రం రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి చూసారు. సినిమా చూసిన అనంతరం ఆయన మహేష్ బాబుపై, దర్శకుడు కొరటాల శివపై ప్రశంసల వర్షం కురిపించాడు.

తమ ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసాం. పైసా వసూల్ మూవీ. మహేష్ బాబు లుక్స్ సూపర్ అని ప్రశంసించిన రాజమౌళి, దర్శకుడు కొరటాల శివ పని తీరును మెచ్చుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్టును ఫ్యామిలీ సెంటిమెంటుతో చాలా తెలివిగా కలిపారని, అదే ఈ సినిమా విజయ రహస్యం. వెల్ డన్ శివగారు అంటూ అభినందనలు. అయితే కలెక్షన్లు మాత్రం మహేశ్ బాబు వల్లే వస్తాయని వ్యాఖ్యానించారు.

Our whole family enjoyed Srimanthudu: Rajamouli

ఈ సినిమాలో మహేశ్ చాలా కూల్ గా కనపడుతూ, అంచనాలకు అందకుండా నటించి, ఏమాత్రం హడావుడి లేకుండా డైలాగులు చెప్పి ప్రేక్షకుల హృదయాలను చేరుకున్నారన్నారు. యూనిట్ సమష్టి కృషి చాలా అత్యద్భుతంగా ఉందని రాజమౌళి మెచ్చుకున్నారు. ఇక శ్రుతిహాసన్ ని చూస్తే ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతామని, ఆమె తన నటనలో చాలా ఎత్తులు ఎదిగిందని ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో సినిమాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందలు అంటూ వ్యాఖ్యానించారు.

మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.

ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
"The success of srimanthudu lies in the clever mixture of village adoption with family sentiment. Well done sivagaru. But The paisa vasool Comes from the man himself, mahesh looks cool, acts subtle talks mellow. But the overall effect is flabbergasting." Rajamouli tweeted.
Please Wait while comments are loading...