»   » ఘనంగా 'ఓయ్' దర్శకుడు వివాహం

ఘనంగా 'ఓయ్' దర్శకుడు వివాహం

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఓయ్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ రంగా ఓ ఇంటి వాడయ్యాడు. ఆదివారం రాత్రి (మే 23) హైదరాబాద్ ‌లో బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సౌమ్య మెడలో మూడు ముళ్లూ వేశాడు. ఇక ఆయన వివాహమాడిన పెళ్లి కూతరు సౌమ్య. 'రేడియో మిర్చి' రేడియో జాకీ గా పాపులర్ అయిన ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగానూ పరిశ్రమలో వారికి పరిచయస్తురాలే. ఇలియానా,కాజల్, నయనతార,అనూష్క వంటి స్టార్ హీరోయిన్స్ కు ఆమె డబ్బింగ్ చెప్తూంటారు. ఆమె 'లక్ష్యం' చిత్రంలో అనుష్కకు డబ్బింగ్ చెప్పినందుకు ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా నంది అవార్డును సైతం గెలుచుకున్నారు. నిర్మాతలు డి. సురేశ్‌ బాబు, ఎం. శ్యాంప్రసాద్‌రెడ్డి, దిల్ రాజు, ఎం.ఎల్. కుమార్‌చౌదరి; హీరోలు సిద్ధార్థ్, కృష్ణుడు, దర్శకులు సుకుమార్, దశరథ్, శ్రీవాస్, దంతలూరి చైతన్య, రాజ్ పిప్పళ్ల, వీరు పోట్ల తదితర చిత్రసీమ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. ఇక 'ఓయ్' చిత్రంలో సిద్ధార్థ, షామిలి జంటగా నటించారు. ఇక ప్రస్తుతం ఆయన వైకుంఠపాళి అనే స్క్రిప్టుని సురేష్ ప్రొడక్షన్స్ లో సబ్మిట్ చేసారు. అలాగే మరో ఇద్దరు పెద్ద హీరోలకు ఆయన కథలు వినిపించి ఎదురుచూస్తున్నట్లు సమాచారం.ఆనంద్ రంగా వివాహానికి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu