»   » రజనీకాంత్‌కు పద్మ విభూషణ్, రాజమౌళికి పద్మశ్రీ

రజనీకాంత్‌కు పద్మ విభూషణ్, రాజమౌళికి పద్మశ్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మ పద్మ అవార్డులను  సోమవారం ప్రకటించింది. సినిమా రంగం నుండి ఈ సారి రజనీకాంత్‌కు ‘పద్మ విభూషణ్' పురస్కారం అందుకోబోతున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, గాయకుడు ఉదిత్ నారాయణ్ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.

ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డు దక్కింది. బాహుబలి లాంటి భారత దేశం గర్వించదగ్గ సిినమా తీసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కినట్లు స్పష్టమవుతోంది. అదే విధంగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, ప్రియాంక చోప్రా కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

Padma Vibhushan for Rajinikanth, Rajamouli Padmasri

రజనీకాంత్ కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు. రజనీకాంత్ నటుడిగా సినిమా రంగానికి చేసిన సేవాలకు గాను ఆయన్ను ఎంపిక చేసారు.  అనుపమ్ ఖేర్ తనకు అవార్డు దక్కడంపై ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేసారు.

English summary
Famous and Prestigious awards of India Padma Awards 2016 nominees and winners list has been out. Superstar Rajinikanth will be honoured with Padma Vibhushan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu