»   » అల్లు అర్జున్ కి వల వేస్తున్న పద్మప్రియ!?

అల్లు అర్జున్ కి వల వేస్తున్న పద్మప్రియ!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ లో ఏదో ఉంది..నేను ఇష్టపడటానికి...అలాగే అతని చిత్రాలు కేరళలలో బాగా పాపులర్..తెలుగు చిత్రాలు డబ్బింగై అంతలా ఆడటం ఆశ్చర్యం కలిగిస్తూంటుంది అంటోంది పద్మప్రియ. లేటస్ట్ గా ఆమె చేసిన అందరి బంధువయా చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవటంతో ఆమె ఉషారుగా ఉంది. దాంతో తనను కలిసిన మీడియాతో ఇలా వ్యాఖ్యానిస్తోంది. ఇక ఇలా మాట్లాడటం ద్వారా ఇక్కడ సెటిలవ్వాలనే ఆలోచన ఆమె వ్యక్తం చేస్తోందని, అల్లు అర్జున్ వంటి స్టార్ తో చేయాలని ఆమె ఉద్దేశ్యమని అంటున్నారు. మరి అల్లు అర్జున్ ఈ ముద్దుగుమ్మ మాటలు విని అవకాశమిస్తాడేమో చూడాలి. అలాగే తాను డైరక్టర్స్ ఆర్టిస్టునని ఆమె చెపుతోంది. డైరక్టర్ ఎలా చెబితే అలా చేయబట్టే అందరిబంధువయా చిత్రం నిజజీవిత చిత్రంలా వచ్చిందని అంటోంది. ప్రస్తుతం కన్నడ, తమిళ్, మళయాళి స్క్రిప్టులు రోజూ వింటున్నానని మంచి సినిమాతోనే మళ్ళీ పలకరిస్తానని హామీ ఇస్తోంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu