For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘పద్మావతి’ సినిమా కోసం.. 400 కేజీల బంగారం, 200 క్రాఫ్ట్‌మెన్, 600 రోజులు!

  By Bojja Kumar
  |

  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావతి' ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఇండియన్ సిల్వర్ స్కీన్ మీద బాహుబలి తర్వాత మరో విజువల్ వండర్ చూడబోతున్నామనే అభిప్రాయానికి వచ్చారు.

  దీపిక పదుకోన్, రణవీర్ సంగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా తెరపైకి రావనికి తెర వెనక దర్శక నిర్మాతలు, డిజైనర్లు, ఇతర టెక్నీషియన్లు పడిన కష్టం చూస్తే షాకవ్వాల్సిందే.

  పద్మావతి క్యారెక్టర్ కోసం భారీగా బంగారం

  పద్మావతి క్యారెక్టర్ కోసం భారీగా బంగారం

  సినిమాలో రాణి ‘పద్మావతి' క్యారెక్టర్ కోసం దర్శకుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సీన్లోనూ రాజసం ఉట్టిపడేందుకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. ఇందుకోసం నిజమైన బంగారన్ని వందల కేజీలు వాడారట.

  400 కేజీల బంగారం

  400 కేజీల బంగారం

  ఈ సినిమా కోసం 400 కేజీల బంగారం వాడారట. ఇందుకోసం దేశంలోనే అతిపెద్ద జ్యువెల్లరీ సంస్థ అయిన తనిష్క్ తో టై అప్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘పద్మావతి' టీం ఓ వీడియోను కూడా విడుదల చేశారు.

  200 మంది, 600 రోజుల పాటు కష్టపడ్డారు

  పద్మావతి సినిమా కోసం వాడిన ఆభరణాల కోసం దాదాపు 200 మంది క్రాఫ్ట్ మెన్, 600 రోజుల పాటు కష్టపడ్డారు. 13వ శతాబ్దం కాలం నాటి చరిత్రను ప్రతిబింబించడంలో భాగంగా నటీనటులు వాడే ఆభరణాలు కూడా ఎంతో ముఖ్యం.

  చిత్తోర్ కోటను 1303 సంవత్సరంలో

  చిత్తోర్ కోటను 1303 సంవత్సరంలో

  రాణి పద్మావతి పాలిస్తున్న చిత్తోర్ కోటను 1303 సంవత్సరంలో ఉల్లాఉద్దీన్ ఖిల్జీ ముట్టడించాడు. ఆ యుద్ధం ఎపిసోడ్ ను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ‘పద్మావతి' చిత్రం సాగుతుంది.

  రణవీర్ సింగ్ టెర్రిఫిక్ లుక్

  రణవీర్ సింగ్ టెర్రిఫిక్ లుక్

  ఈ చిత్రంలో మహ్మదీయరాజు అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నారు. ట్రైలర్లో రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్ గా ఉంది. భారీ శరీరంతో, ఎంతో క్రూరమైన లుక్ లో రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అదరగొట్టాడని తెలుస్తోంది.

  షాహిద్ కపూర్

  షాహిద్ కపూర్

  ఈ చిత్రం షాహిద్ కపూర్ పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. రాజ్ పుత్ వంశరాజుగా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు సైతం లెక్కచేయని వీరుడి పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.

  దీపిక బ్యూటిఫుల్ లుక్

  దీపిక బ్యూటిఫుల్ లుక్

  ‘పద్మావతి'గా టైటిల్ రోల్ చేస్తున్న దీపిక పదుకోన్ ఎంతో బ్యూటిఫుల్‌గా సినిమాలో కనిపించింది. ఆమె కెరీర్లో ఈ చిత్రం ది బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు.

  కళ్లకు కట్టినట్లుగా...

  కళ్లకు కట్టినట్లుగా...

  1303 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. సినిమాలో సెట్టింగ్స్, కాస్టూమ్స్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి.

  పద్మావతి జీవితం ఆధారంగా

  పద్మావతి జీవితం ఆధారంగా

  14వ శతాబ్దానికి చెందిన రాణి పద్మావతి, ఆమె భర్త రావల్ రతన్ సింగ్.... అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోర్ కోటను ఆక్రమించిన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటలను ఫోకస్ చేస్తూ ఈ సినిమా ఉండబోతోంది.

  పద్మావతి మరణిస్తుందా...

  పద్మావతి మరణిస్తుందా...

  చరిత్ర ప్రకారం అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోర్ కోటను ఆక్రమించి... కోటను స్వాధీనం చేసుకుని రావతల్ రతన్ సింగ్ ను చంపేసిన సమయంలో.... పద్మావతితో పాటు కోటలోని మహిళలంతా అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ సినిమాలో కూడా పద్మావతిని అలాగే చూపిస్తారని తెలుస్తోంది.

  మూడో సారి

  మూడో సారి

  సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ కలిసి నటించడం ఇది మూడో సారి. గతంలో వారు రామ్-లీలా, బాజీరావు మస్తానీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

  ట్రైలర్ ఇదే...

  3 నిమిషాల నిడివితో ‘పద్మావతి' ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. డిసెంబర్ 1న సినిమా విడుదల కాబోతోంది.

  English summary
  Gold and diamond jewellery brand Tanishq has been involved with Sanjay Leela Bhansali's Padmavathi look even more real. The mammoth task of crafting jewellery began way before the film went on floors. Over 200 craftsmen worked for over 600 days moulding 400 kilos of gold to deliver exotic pieces of jewellery for the star cast.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X