»   » కంటతడి పెట్టుకొన్న రణ్‌వీర్.. దర్శకుడు, ప్రియురాలు కారణమట..

కంటతడి పెట్టుకొన్న రణ్‌వీర్.. దర్శకుడు, ప్రియురాలు కారణమట..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పద్మావతి ట్రైలర్‌కు వస్తున్న స్పందనతో చాలా ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా అందరి నుంచి అనూహ్యం స్పందన వస్తున్నది. సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్‌గా మారింది అని బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ వెల్లడించారు. ట్రైలర్‌కు వస్తున్న స్పందన వస్తున్న నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియాలో ఏమన్నారంటే..

  ఖిల్జీ పాత్రకు మంచి రెస్పాన్స్

  ఖిల్జీ పాత్రకు మంచి రెస్పాన్స్

  పద్మావతి ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ చిత్రంలో నేను పోషించిన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రకు ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. నాపై కురిపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.

   ఫ్యాన్స్‌కు థ్యాంక్స్

  ఫ్యాన్స్‌కు థ్యాంక్స్

  ట్రైలర్‌‌లో నా పాత్రపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. నన్ను అంతగా ప్రేమిస్తున్న ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్. అనూహ్యమైన స్పందన చాలా అద్భుతంగా ఉంది. నాపై కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను.

   భన్సాలీ నా గురువు

  భన్సాలీ నా గురువు

  సంజయ్ లీలా భన్సాలీ నా గురువు లాంటివాడు. ట్రైలర్‌నే కాదు సినిమాను రూపొందించిన తీరు ఆయన ప్రతిభకు అద్ధం పట్టింది. పద్మావతి చిత్రం బాలీవుడ్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలుచున్నాడు అని భన్సాలీపై ప్రశంసలు కురిపించాడు.

   సంజయ్ అద్భుతమైన ఫిల్మ్ మేకర్

  సంజయ్ అద్భుతమైన ఫిల్మ్ మేకర్

  అంతేకాకుండా సంజయ్ సర్. నీవు అంటే చెప్పలేనంత ఇష్టం. నీవు అద్భుతమైన ఫిల్మ్ మేకర్. సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. అనేక అవమానాలు ఎదుర్కొన్నావు. ట్రైలర్‌కు వస్తున్న స్పందన‌తో మీ కృషికి తగిన ఫలితం దక్కింది అని రణ్‌వీర్ పేర్కొన్నారు.

  పద్మావతి గొప్ప అనుభూతి

  పద్మావతి గొప్ప అనుభూతి

  పద్మావతి సినిమా షూటింగ్ మా అందరికీ ఓ గొప్ప అనుభూతిని మిగిల్చింది. చివరి షెడ్యూల్ ముగిస్తున్న సమయంలో మేమంత ఉద్వేగానికి గురయ్యాం. ఓ దశలో కంటతడి పెట్టుకొన్నాం. జీవితంలో మరిచిపోలేనటువంటి మెమొరీని పద్మావతి చిత్రం ఇచ్చింది.

   దీపికా పదుకొనే చూపించిన ప్రేమ

  దీపికా పదుకొనే చూపించిన ప్రేమ

  పద్మావతి చిత్ర షూటింగ్ సందర్భంగా దీపికా పదుకొనే చూపించిన ప్రేమ, అందించిన సహకారం చాలా గొప్పది. అందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను అని రణ్‌వీర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఖిల్జీగా రణ్‌వీర్, రాణి పద్మావతిగా దీపికా పదుకొనే, మహర్వాల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారు.

   డిసెంబర్ 1న రిలీజ్

  డిసెంబర్ 1న రిలీజ్

  ఎన్నో ఘనతలు, మధురానుభూతులు ఉన్న పద్మావతి చిత్రం. అలాంటి చిత్ర ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ ఆమోఘం ఉంది. నా లుక్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆనందబాష్పాలు రాలుతున్నాయి అని రణ్‌వీర్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ తెలిపారు. డిసెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఈచిత్రంలో అదితిరావు హైదరీ, జిమ్ సర్బా, రాజా మురాద్ తదితరులు నటించారు.

  English summary
  Actor Ranveer Singh said he is overwhelmed and humbled with the response the first trailer of Padmavati received, calling it unprecedented and rare. The first preview of Sanjay Leela Bhansali's much-awaited magnum opus received high praise both by the Bollywood fraternity and social media for what it appears to be a concoction of passion and power. In a lengthy Instagram post, Ranveer, who plays Sultan Alauddin Khilji besides Deepika Padukone's Rani Padmavati and Shahid Kapoor's Maharawal Ratan Singh, thanked his fans and followers for their love and appreciation.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more