Just In
- 30 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 35 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘పైసా’ యూనిట్ షాక్...అది రియల్ డాన్ డెన్
హైదరాబాద్ : నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో 'పైసా' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను దుబాయ్ లోని ఓ పబ్‌లో చిత్రీకరించారు. ఆ తర్వా వారు తెలుసుకున్న విషయం ఏమిటంటే...ఆ పబ్ వరల్డ్ ఫేమస్, మోస్ట్ వాండెట్ డాన్ కు సంబంధించినది అని. ఆ డాన్‌ను పట్టుకునేందుకు భారతీయ గూడచార సంస్థ RAW పాటు FBI ఎప్పటి నుండో ప్రయత్నిస్తోంది. ఈ విషయం తెలిసి పైసా యూనిట్ సభ్యులు కాస్త షాకయ్యారట.
నాని హీరోగా రూపొందుతున్న 'పైసా' మూవీని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. సరికొత్త కథాంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో నాని సరసన కేథరీన్ నటిస్తుంది. ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్ర వేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో కేవలం పాటల చిత్రీకరణ కోసం దాదాపు కోటికిపైగా వెచ్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా కాస్టూమ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడుతున్నారట. ఓక్కో సూట్ కోసం దాదాపు 20 వేల క్రిస్టల్స్ వాడుతున్నారు. వీటితో తయారు చేసే ఒక్కో సూట్ కు రూ. 7.5 లక్షల వరకు ఖర్చవుతుందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఇలాంటి సూట్ తో పెర్ఫార్మ్ చేయలేదట. ఇంతకీ వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే.... మైఖేల్ జాక్సన్ ఇలాంటి క్రిస్టల్స్ తో చేసిన కాస్ట్యూమ్స్ వాడేవారని యూనిట్ సభ్యులు అంటున్నారు.
క్రియేటివ్ దర్శకుడిగా ఎందరో కొత్త వారిని తెలుగు తెరకు పరిచయం చేసిన కృష్ణ వంశీ తన తాజా చిత్రం 'పైసా' చిత్రంలో కొత్త ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. వీరిలో అక్బర్ బిన్ టాబర్, రాజు శ్రీవాస్తవ, లోబో, ఇతర నటీనటులు ఉన్నారు.