»   » అన్నీ ఊరమాసు లెక్కలే.. (కాజల్ పక్కా లోకల్ సాంగ్ టీజర్)

అన్నీ ఊరమాసు లెక్కలే.. (కాజల్ పక్కా లోకల్ సాంగ్ టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' మూవీ రిలీజ్ హైప్ హైరేంజికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కాజల్ తో చేయించిన పక్కాలోకల్ సాంగ్ వీడియో టీజర్ రిలీజ్ చేసారు. అన్నీ ఊరమాసు లెక్కలే అంటూ కాజల్ తన హాట్ అండ్ సెక్సీ అందాలతో సాంగులో అదరగొట్టింది.

సినిమా గురించి మాట్లాడుతూ ఈ ఎనర్జిటిక్ నెంబర్‌లో తారక్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని తెలిపారు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమాలో తన పాట అందరినీ ఆకట్టుకుంటుందని, సినిమా విడుదల కోసం తానూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.

కాగా...ఈ ఒక్క సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ యాభై లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందట. మిగతా విషయాల్లో ఏమో కానీ రెమ్యూనరేషన్ దగ్గర మాత్రం కాజల్ అస్సలు తగ్గదు. అందుకే అరకోటి తీసుకుని ఐటెం సాంగ్‌కి సై అనేసిందట.

Pakka Local Video Teaser-Kajal

సినిమాలో ఈ సాంగ్ పెట్టడంపై దర్శకుడు కొరటాల శివ స్పందిస్తూ...దీన్ని ఐటం అనడం బాగోలేదు. ప్రత్యేక గీతం అందాం. ఎవరో డాన్సర్‌ను పెడితే వేరే స్థాయిలో వుంటుంది. కానీ సన్నివేశపరంగా పాటకు హైప్‌ రావాలంటే.. పేరున్న హీరోయిన్‌ కావాలి. వారు చేస్తేనే పండుతుంది. నిర్మాతలు కూడా కాజల్‌ కావాలన్నారు. సరే.. తెచ్చుకోండని చెప్పాను అని చెప్పారు.

English summary
"Pakka Local" Video Teaser From New Telugu Movie "Janatha Garage" Directed By Koratala Siva & Music Composed By Devi Sri Prasad, starring Jr NTR, Samantha, Mohanlal, Nithya Menen.Produced by Naveen Yerneni, Y Ravi Shankar and CV Mohan. Banner : Mythri Movie Makers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu