»   » ఆన్‌లైన్లో...‘పాండవులు పాండవులు తుమ్మెద’

ఆన్‌లైన్లో...‘పాండవులు పాండవులు తుమ్మెద’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీ 'పాండవులు పాండవులు తుమ్మెద' ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలసిందే. ఈ చిత్రాన్ని థియేటర్ రిలీజ్‌తో పాటు ఆన్ లైన్లోనూ విడుదల చేసారు నిర్మాతలు. అయితే ప్రస్తుతానికి యూరఫ్, దక్షిణాఫ్రికా దేశాల్లో zingreel.com ద్వారా ఈ సినిమాను చూడొచ్చు, త్వరలో వరల్డ్ వైడ్‌‌గా ఆన్‌లైన్లో సినిమా అందుబాటులోకి వస్తుందని మంచు విష్ణు తెలిపారు.

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Pandavulu Pandavulu Tummeda

సినిమా నిర్మాణానికి మొత్తం 30 కోట్లు ఖర్చయిందని, ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం రిస్క్ అని తెలిసినా సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ధైర్యం చేసామని.......అందుకే ఎవరినీ రిస్కులో పడేయకుండా తామే స్వయంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల మోహన్ బాబు తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

English summary
Pandavulu Pandavulu Tummeda is the first big ticket Telugu film to be released both in theatres as well as online on zingreel.com simultaneously. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu