For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గుర్తుపట్టారా?: జిమ్ లో కష్టపడుతోంది!!(ఫొటో)

  By Srikanya
  |

  ముంబై: హీరోలు చెమటోడుస్తూ జిమ్ లో కష్టపడటం చూస్తూనే ఉంటాం. అయితే హీరోయిన్స్ కొంతమందికి కూడా జిమ్ బాడీ కావాలనిపిస్తుంది. అందుకోసం వారు కష్టపడుతూంటారు. పవన్‌ కళ్యాణ్‌ 'పంజా' చిత్రంలో నటించిన సారా జేన్‌ డయాస్‌ గుర్తుండే ఉంటుంది. చిత్రం హిట్ కాకపోయినా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఆ తర్వాత సెంటిమెంట్ ని పూర్తిగా నమ్మే ఈ ఫీల్డ్ లో ఆమెకు ఆఫర్స్ రాలేదనుకోండి. అయితే మాత్రం ఎప్పటికైనా మంచి అవకాశాలు రాకపోతాయా అప్పటికి రెడిగా అన్నట్లు గా ఈ ముద్దుగుమ్మ ఇదిగో ఇలా జిమ్ లో కష్టపడుతోంది.

  సారా జేన్‌ డయాస్‌ చదివింది మస్కట్‌ లో అయినా పెరిగిందంతా ముంబాయ్‌. ఆమె తొలిసారిగా తమిళంలో తొలిసారిగా 'తీర్ధ విలయాట్టు పిళ్లై' (తెలుగులో కిలాడి) చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఈ సుందరి వి చానల్‌ ద్వారా సుపరిచితురాలు. 2007లో మిస్‌ వరల్డ్‌ పోటీలో కూడా పాల్గొంది. గత సంవత్సరం అభిషేక్‌బచ్చన్‌తో కలిసి 'గేవ్గు' చిత్రంలో నటించింది. అరుుతే తెలుగులో ఆమె నటించిన 'పంజా' నిరాశనే మిగిల్చింది. ఇప్పటిదాకా సరైన హిట్‌ లేక ఎదురుచూస్తున్న సారాజేన్‌కు అనుకోకుండా బాలీవుడ్గలో ఓ మాంచి హీరోయిన్‌ ఓరియెంటెడ్ చిత్రంలో నటించే అవకాశం లభించింది.

  ఆమె 1997లో 'మిస్‌ ఇండియా ఒమన్‌' టైటిల్‌ను సాధించడంతో సారా కేరీర్‌ 14వ ఏటనే ప్రారంభమైందని చెప్పుకోవాలి. అంతకు సరిగ్గా పది సంవత్సరాల తరువాత, అంటే 2007లో 'ఫెమినా మిస్‌ ఇండియా' అందాల కిరిటాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం తరువాత ఆమెకు సినిమా రంగం నుంచి కూడా ఎన్నో మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆమె హిందీలో చేసిన 'క్యా సూపర్‌ కూల్‌ హే హమ్‌' చిత్రం మాత్రం వర్కవుట్ కాలేదు.

  'Panjaa' Girl Sarah Jane Caught Working Out

  కొందరికి పాడడమేవచ్చు. ఇంకొందరికి నటించడమే వచ్చు. మరికొందరికి కేవలం మోడల్స్‌గా వుండడమే ఇష్టం. అదేం కాదు... ఇంకొంతమంది టీవీ యాంకర్ గా వుండడానికే ఇష్టపడతారు. కానీ ఈపై చెప్పిన లక్షణాలన్నీ సారా జేన్ డయాస్‌లో వుండడం విశేషం. సారా చక్కగా పాడగలదు. మోడల్‌గా ముందే రాణించింది. నటిగా ‘గేమ్', ‘క్యా సూపర్ కూల్ హై హమ్' ద్వారా నిరూపించుకుంది. టీవీ వ్యాఖ్యాత్రిగా రియాల్టీ షోలు నిర్వహించి అందరి అభిమానాన్ని పొందింది. అలాగని ఎందులోనూ రాజీపడదు. అలా రాజీపడని తత్వం ఆమె మాటల్లోనే...

  ఆమధ్య ఓ రియాల్టీ షో చేశాను. తర్వాత ఇప్పుడేం చేయడంలేదు. అలాగని చేయకూడదని కాదు. ఏదైనా మంచి ఆఫర్‌వస్తే రియాల్టీ షోలకు తయారే!నాకెందుకో జీవితాన్ని రొటీన్‌గా గడపడం ఇష్టం వుండదు. ఓ సినిమాలో ఓ తరహా వేషం వేస్తే వెనువెంట వచ్చే చిత్రం అందుకు పూర్తి భిన్నంగా వుండాలి. అదే పద్ధతిలో ‘గేమ్' తర్వాత ‘క్యా సూపర్ కూల్ హై హమ్' లాంటి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంలో నటించా.

  అందరూ అనుకున్నట్లు ‘క్యా సూపర్...' చిత్రం సెక్స్ ఆధారిత కామెడీ కాదు. అంతర్గతంగా ఆ భావం దొర్లే హాస్యపు దొంతరది.

  సినిమాలకు పాడను. నేను గాయనినైనా ‘క్యా సూపర్ కూల్ హై హమ్'లో పాడలేదు. కారణం... సినిమాల్లో నేను పాడదలుచుకోకపోవడమే. నాదైన బాణీ సొంతంగా పాటలు పాడి పాటల ఆల్బమ్‌లు విడుదల చేస్తాను అన్నారు సారా జేన్ డయాస్.

  English summary
  Sara Jane Dias is looking fabulous working at gym in the recent times. The actress is in praises for GQ fitness programme and hit the gym doing workouts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X