»   » 'పరమవీర చక్ర' ఎంతకు కొంటే..ఎంత వసూలు చేస్తోంది?

'పరమవీర చక్ర' ఎంతకు కొంటే..ఎంత వసూలు చేస్తోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ, దాసరి కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా విడుదలైన పరమవీర చక్ర చిత్రం ఇప్పటికే ప్లాఫ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే సింహా వంటి హిట్ తర్వాత వచ్చిన ఈ చిత్రం ఎంత ప్లాప్ అయినా కలెక్షన్ల పరంగా పూర్తిగా నిరుత్సాహపరచదని,మొదటివారంలో పండుగ పేరు చెప్పి కొంత రికవరి అవుతుందని ట్రేడ్ లో వినపడింది. అయితే అందుకు పూర్తి విరుద్దంగా జరుగుతోంది. ఎప్పుడూ మొదటిరోజు ఓపినింగ్స్ అదరకొట్టే కృష్ణా జిల్లాలో మొదటి రోజు కేవలం పద్దెనిమిది లక్షలు వసూలు చేస్తే రెండో రోజుకు లక్షా ఎనభై వేలకు పడిపోయి డిస్ట్రిబ్యూటర్స్ కి, ధియోటర్స్ వారికీ షాక్ ఇచ్చింది. ఇదే సెగ కంటిన్యూ అయితే కేవలం ముప్పై ఐదు లక్షలు మించి ఈ చిత్రం వసూలు చేయలేదని అంటున్నారు. దాంతో అక్కడ కోటి డబ్బై లక్షలు పోసి కొన్న వారి పరిస్ధితి ఏమిటనేది అర్ధం కాకుండా ఉంది. మరో ప్రక్క దీనికి పూర్తి విరుద్దంగా డివైడ్ టాక్ తెచ్చుకున్నా మిరపకాయ సేఫ్ గా ఉంది. గోల్కొండ హైస్కూల్...దాని బడ్జెట్ కు తగ్గ షేర్ తెచ్చుకుంటుందని అంటున్నారు. ఇక అనగనగ ఓ ధీరుడు కలెక్షన్స్ పరిస్ధితి పరమవీర చక్రకు బాగా దగ్గరగా ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu