twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాజిక్ లెస్ అంటూ సర్కారు వారి పాట ట్రోలింగ్.. పాతిక వేల లెక్క చెప్పిన పరశురామ్

    |

    మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే నెల 12వ తేదీన విడుదలయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది. సినిమా టాక్ సంగతి ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి. దీంతో ఈ సినిమా త్వరలోనే హిట్ స్టేటస్ సాధించడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని లాజిక్ లేని సీన్స్ తీశారు అనే వాదన ఉంది. ఈ విషయం మీద తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ఆ లాజిక్ లేని విషయాల మీద క్లారిటీ ఇచ్చారు దర్శకుడు పరశురామ్. ఆ వివరాలు

    సక్సెస్ ఈవెంట్ కూడా

    సక్సెస్ ఈవెంట్ కూడా


    దర్శకుడు పరశురామ్ సమయం, సందర్భం లేకుండా సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టాడు. నిజానికి సర్కారు వారి పాట సినిమాపై చాలా విమర్శలున్నాయి. అయితే ఆ నెగటివ్ రివ్వూలు, నెగెటివిటీ దాటి సినిమా సక్సెస్ అయింది అని యూనిట్ బహిరంగంగా చెప్పుకుంటోంది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయని యూనిట్ ప్రతిరోజు ప్రకటిస్తోంది. ఇప్పటికే ఓకే సినిమా యూనిట్ ప్రత్యేకంగా సక్సెస్ పార్టీ ఎంజాయ్ చేసింది. అభిమానులతో కలిసి సక్సెస్ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున నడిపారు.

    పరశురామ్ ప్రెస్ మీట్

    పరశురామ్ ప్రెస్ మీట్


    ఇలా సాగుతున్న క్రమంలో పరశురామ్ ప్రెస్ మీట్ పెట్టాడు. లాజిక్స్ మీద క్లారిటీ ఇవ్వమంటే లాజిక్ లేకుండా మాట్లాడి మరోసారి దొరికిపోయాడు. నిజానికి సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కు 2 దఫాలుగా డబ్బులిస్తాడు మహేష్. ఒకసారి 10వేల డాలర్లు, మరోసారి 25 వేల డాలర్లు ఇస్తాడు. అంటే మొత్తం 35 వేల డాలర్లు ఆమె చేతిలో పెడతాడు. అయితే సినిమా ఆసాంతం తన 10వేల డాలర్లు వెనక్కి ఇవ్వాలని మాత్రమే అడుగుతుంటాడు.

    మొదటి 10వేల డాలర్లు

    మొదటి 10వేల డాలర్లు


    ఆ పది వేల డాలర్ల కోసమే ఇండియా వచ్చాను కూడా చెబుతూ ఉంటాడు. మరి ఇది ఎలా లాజిక్ మిస్ అయింది అని మీడియా ప్రశ్నిస్తే, దాన్ని తనదైన శైలిలో సమర్థించుకున్నాడు పరశురామ్. అది ఏమిటి అంటే మొదటి 10వేల డాలర్లు అప్పుగా ఇచ్చాడట. కాబట్టి అది మాత్రమే తిరిగి ఇవ్వాలని మహేష్ బాబు పాత్ర అడుగుతూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. మిగతా 25 వేల డాలర్లు ప్రేమతో ఇచ్చాడు కాబట్టి అడగడు అని చెప్పుకొచ్చారు.

     ఆ పది వేలు కూడా

    ఆ పది వేలు కూడా


    అయితే ఇక్కడ కూడా పరశురామ్ లాజిక్ మిస్ అయ్యారు అదేమిటి అంటే నిజానికి మొదట ఆమెకు అప్పు ఇవ్వడానికి తన కంపెనీ రూల్స్ ఏ మాత్రం సహకరించకపోయినా ఆమె మీద ప్రేమ ఉన్న కారణంగా ఆ రూల్స్ పక్కనపెట్టి మరీ పది వేల రూపాయలు అప్పుగా ఇస్తాడు.. మరి ఇలా పరశురామ్ చెప్పిన లాజిక్ ప్రకారం మొదటి సారి కూడా ప్రేమకోసమే ఇచ్చాడు కాబట్టి ఆ పది వేలు కూడా అడగకూడదు కదా?

     రుబాబు చేయకుండా

    రుబాబు చేయకుండా


    అలాగే తనకు రావలసిన డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని కొట్టి మరీ వసూలు చేసే మహేష్ బాబు అదే భారతదేశంలో రికవరీ ఏజెంట్లు, లోన్ కట్టలేదు అని తనికెళ్ల భరణి దంపతుల మీద రుబాబు చేస్తే తిరిగి వాళ్ళని కొట్టి పంపిస్తాడు. మరి ఇది ఎక్కడ లాజిక్ అని ప్రశ్నిస్తే ఇక్కడ కూడా తనదైన శైలిలో క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు పరశురాం. అయితే ఇక్కడ రుబాబు చేయకుండా వసూలు చేయాలని అడిగాడని అలాగే భారీ ఎత్తున డబ్బు కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు ముందు వాళ్ళ చేత డబ్బు కట్టించి వీళ్ళ దగ్గరకు రావాలని చెప్పాడని చెప్పుకొచ్చారు. ఇంత క్లియర్ గా పరశురాం చెప్పినా ఇందులో కూడా లాజిక్ లేదని అనిపిస్తోంది.

    వీరి మధ్య బంధం స్వచ్ఛమైనది

    వీరి మధ్య బంధం స్వచ్ఛమైనది


    ఇక హీరోయిన్ పై కాలు వేసుకొని పడుకునే ఎపిసోడ్ పై కూడా తనదైన స్టైల్ లో లాజికల్ గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు పరశురామ్. ఇందులో అసలు వల్గారిటీ ఏ మాత్రం లేదని, చిన్నప్పుడు తల్లిని కోల్పోయిన మహేష్ పాత్ర హీరోయిన్ ను అమ్మలా చూసుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఆ సన్నివేశాల్లో వల్గారిటీ లేదని, ఉంటే మహేష్ బాబు అసలు చేసేవారే కాదని పరశురామ్ పేర్కొన్నాడు. ఇక పిల్లలు ఎప్పుడూ తల్లి పక్కన పడుకోవాలి అనుకుంటారని, అలాగే వీరి మధ్య బంధం కూడా స్వచ్ఛమైనది అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

    English summary
    director Parasuram gave clarity on logic less scenes in sarkaru vaari paata.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X