Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఆయనతో ముందు శత్రుత్వము, నన్ను బూతులు రాసే రైటర్ అన్నారు: పరుచూరి
'పరుచూరి పలుకులు' అనే శీర్షికతో తన అనుభవాలను పంచుకుంటున్న ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా అల్లు రామలింగయ్య గురించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన్ను నేను ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తానని, అయితే బాబాయ్ అని పిలవడానికి ముందు మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండేదని, ఆ తర్వాత మిత్రుత్వం మొదలైందని తెలిపారు.
ముందు శత్రుత్వం నుండి మొదలై మిత్రుత్వంలోకి వస్తే అదో అద్భుతమైన ముగింపుకు దారి తీస్తుందని మన పెద్దలు చెప్పే మాటకి రామలింగయ్య గారితో తన అనుబంధమే ఉదాహరణ అని పరుచూరి తెలిపారు.

ఆ డైలాగ్ ఏమిటీ అంటూ నాపై ఫైర్ అయ్యారు
‘1980లో అనురాగ దేవత షూటింగ్ జరుగుతున్న సమయంలో రామలింగయ్య గారికి ఓ డైలాగ్ ఉంది. నూతన ప్రసాద్‌ను ఉద్దేశించి ‘క్లీనర్ నా కొడకా' అని తిట్టాలి. కానీ ఆయన నేను ఈ డైలాగ్ చెప్పాను అన్నారు. ఎవరు ఇది రాసింది అంటూ అప్పుడప్పుడే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన మమ్మల్ని పిలిచి ఏంటయ్యా ఇది అని ఫైర్ అయ్యారు అంటూ... పరుచూరి గుర్తు చేసుకున్నారు.

అన్నగారికి వెళ్లి నాపై కంప్లయింట్ చేశారు
‘వేరే డైలాగ్ రాయమంటే మేము రాయలేదు. ఏమండీ అన్నగారికి సీన్ వెళ్లిపోయింది. అన్నగారు లోపల ఉన్నారు. ఆయన సీన్ చూసుకున్నారు. ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. మీరు చెప్పను అంటే వెళ్లి అన్నగారికి చెప్పాల్సి వస్తుంది అని చెప్పడంతో.... ఆయనతోనే చెబుతాను అంటూ అన్నగారి దగ్గరకు వెళ్లి మాపై కంప్లయింట్ చేశారు... అని పరుచూరి గుర్తు చేసుకున్నారు.

అన్నగారు నేచురల్ గా ఉంటుంది అనడంతో..
‘అన్న గారు, ఏం డైలాగ్ అండీ ఇది..... ఆ నూతన ప్రసాద్ ను నేను క్లీనర్ నా కొడకా అనడం ఏమిటి? బాగోదు... ఆయనకు చెప్పండి మార్చమని అని అడిగారు. దానికి అన్నగారు స్పందిస్తూ... నేనూ వారిని అడిగాను రామలింగయ్యగారు, విజయవాడ ప్రాంతంలో లారీ ఓనర్లు క్లీనర్లను అలానే తిడతారట. నేచురల్ గా ఉంది చెప్పేసేయండి అని చెప్పడంతో అల్లు రామలింగయ్య గారికి మరింత కోపం వచ్చిందని... పరుచూరి గుర్తు చేసుకున్నారు.

బూతులు రాసే రైటర్ అంటూ ఫైర్
అన్నగారు కూడా అదే డైలాగ్ చెప్పమనడంతో రామలింగయ్య గారికి బాగా కోపం వచ్చింది. బయటకు వచ్చి ఆ కోపాన్ని నా మీద చూపించారు. ఏం చేస్తాం... ఈ మధ్య బూతులు రాసే రైటర్లు ఇండస్ట్రీకి వచ్చారు అంటూ ఫైర్ అయ్యారు... అని పరుచూరి గుర్తు చేసుకున్నారు.

ఆ సినిమాతో నాపై అభిప్రాయం మారింది
తర్వాత చాలా సినిమాలకు ఆయనతో కలిసి పని చేశాను. నాపై కోపంగానే ఉండేవారు. ఒక రోజు అర్ధరాత్రి మద్రాసు నుండి ఫోన్ చేశారు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో' అనే పోస్టర్ చూశాను. కథ మాటలు పరుచూరి గోపాలకృష్ణ అని ఉంది, అది మీరేనా?' అని అడిగారు. అవును సార్ నేను అన్నాను. ఈ సినిమా రాసిన చేతులతో క్లీనర్ నా కొడకా అని ఎలా రాయగలిగావయ్యా అన్నారు. ఎదురుగా ఉంటే నిన్ను కౌగిలించుకునే వాడిని అన్నారు. ఆయన సినిమా ఆయనకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ఆ సినిమాతో నాపై అభిప్రాయం మార్చుకున్నారు అని పరుచూరి గుర్తు చేసుకున్నారు.

మా ఇంటికి వచ్చేవారు
రామ లింగయ్య గారికి నాకు ఎన్నో సినిమాల్లో అనుబంధం ఉంది. మద్రాసులో ఆయన ఇంటి దగ్గరే మా ఇల్లు ఉండేది. ఇంట్లో ఎవరిమీదైనా కోపం వస్తే నా దగ్గరకు వచ్చేస్తూ ఉండేవారు. ఈయన చీకటి పడినా ఇంకా రాలేదని వారింట్లో టెన్షన్ పడితే... అరవింద్ గారు ఇలా అనేవారట, ఎందుకు కంగారు పడతారు, ఆ గోపాలకృష్ణ ఇంట్లో ఉండి ఉంటాడు అని అనేవారట. కోపం వస్తే ఆయన మా ఇంటికే వచ్చి కూర్చునేవారు. ఆయన కూర్చునే ఆ కాసేపట్లో మనకు ఒక అనుభవాన్ని ఇచ్చేవారు.... అని పరుచూరి గుర్తు చేసుకున్నారు.