twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబు చనిపోకూడదు.. చిరంజీవి డైరెక్ట్‌గా ఫోన్ చేశారు!

    |

    ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పలుకులు పేరుతో పలు చిత్రాల జయాపజయాలని విశ్లేషిస్తూ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్ చిత్రం కొదమసింహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొదమసింహం చిత్రంలో తాము అనుకోకుండా భాగమయ్యామని తెలిపారు. ఆ చిత్రానికి ముందుగా మేము పని చేయలేదు. దర్శకుడు మురళి మోహనరావు, రచయిత సత్యానంద్ ఇద్దరూ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సిద్ధం చేసుకున్నారని పరుచూరి తెలిపారు.

    కొండవీటి దొంగ విడుదలై

    కొండవీటి దొంగ విడుదలై

    అంతకు ముందే తాము పనిచేసిన కొండవీటి దొంగ చిత్రం విడుదలై సంచలనం విజయం సాధించింది. ఆ చిత్రాన్ని ఆరంభంలో అందరూ విమర్శించారని పరుచూరి గుర్తు చేసుకున్నారు. కొండవీటి దొంగ విడుదలయ్యాక చిరంజీవి కొదమసింహం పనుల్లో బిజీ అయ్యారు. ఓ రోజు మా ఇంటికి ఫోన్ వచ్చింది. మా అమ్మాయి లిఫ్ట్ చేయడంతో నేను చిరంజీవిని మాట్లాడుతున్నా అని చెప్పారు. ఆ విషయాన్ని మా అమ్మాయి నాతో చెప్పడంతో.. చిరంజీవిగారు నేరుగా ఫోన్ చేయరే అని అనుకుంటూ మాట్లాడాను. ఫోన్ లో ఆయనే ఉండడంతో సర్ మీరు చేశారు ఏంటి అని ఆశ్చర్యపోయి అడిగాను.

    కథలో తేడా ఉంది

    కథలో తేడా ఉంది

    కొదమ సింహం కథలో నాకు ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తోంది. ఒకసారి మీరు వచ్చి కథ వినండి. కథలో నిజంగా దోషం ఉంటె సరి చేయండి. స్క్రీన్ ప్లే కార్డు మీ పేరుమీద వేయిస్తా అని చిరంజీవి అన్నారు. వెంటనే వెళ్లి కథ విన్నాం. ఆ కథలో ఉండే దోషం నాకు అర్థం అయిపోయింది. సత్యానంద్ కథ చేబోతూ.. ఇంటర్వెల్ లో మోహన్ బాబు చనిపోతాడు అని నవ్వుతూ అన్నారు. నవ్వుతున్నావు ఏంటయా.. అక్కడే అసలు దోషం ఉంది అని చెప్పా.

    మోహన్ బాబు చనిపోకూడదు

    మోహన్ బాబు చనిపోకూడదు

    ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్ర పేరు సుడిగాలి. చాలా అద్భుతమైన పాత్ర అంటూ ప్రశంసలు లభించాయి. హీరో తల్లి తండ్రి ఎక్కడ ఉన్నారో తెలిసింది మోహన్ బాబుకు మాత్రమే. అతడు చనిపోతే ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ ఉండదు. హీరో పరిశోధన చేస్తున్నట్లుగా సెకండ్ హాఫ్ సాగుతుంది. ఆ ఫీలింగ్ ఆడియన్స్ కి కలగకుండా ఉండాలంటే మోహన్ బాబు బ్రతకాలి అని కథలో మార్పులు చేసినట్లు పరుచూరి అన్నారు.

    చిరంజీవి కోసమే

    చిరంజీవి కోసమే

    కొదమ సింహం విడుదలై మంచి విజయం సాధించింది. సాధారణంగా ఇలాంటి చిన్న పనులకు మేము సినిమాలు ఒప్పుకోము. కొదమ సింహం చిత్రాన్ని చిరంజీవి గారి కోసమే ఒప్పుకున్నట్లు పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఆ విధంగా కొదమ సింహం చిత్రం కూడా తమ ఖాతాలో చేరిందని పరుచూరి తెలిపారు.

    English summary
    Paruchuri Gopala Krishna About Megastar Chiranjeevi's Kodama Simham Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X