twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్ లెటర్ చూశా.. 'వినయ విధేయ రామ'లో పొరపాట్లు జరిగాయి!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ని తీవ్ర నిరాశకు గురిచేసింది. రంగస్థలం చిత్రం తర్వాత రాంచరణ్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో అభిమానులలో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ వినయ విధేయ రామ చిత్రం అంచనాలని అందుకోలేకపోయింది. తాజాగా ఈ చిత్రం గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడారు.

     గ్యాంగ్‌లీడర్ గుర్తొచ్చింది

    గ్యాంగ్‌లీడర్ గుర్తొచ్చింది

    వినయ విధేయ రామ చిత్రం చూడగానే నాకు గ్యాంగ్‌లీడర్ చిత్రంలో కొన్ని అంశాలు గుర్తొచ్చాయని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. అన్నదమ్ముల సెంటిమెంట్‌లో కాస్త గ్యాంగ్ లీడర్ షేడ్స్ ఉన్నాయని అన్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ పేరు రామ్ కొణిదెల. గ్యాంగ్ లీడర్‌లో కూడా చిరంజీవి పేరు కొణిదెల రాజారామ్ అని పరుచూరి అన్నారు.

     మంచి పాయింట్

    మంచి పాయింట్

    ఈ చిత్ర కథకు బోయపాటి మంచి పాయింట్ ఎంచుకున్నారని పరుచూరి అన్నారు. ఐదుగురు అనాధలు అన్నదమ్ములుగా మారి ఒకే కుటుంబంగా ఏర్పడతారని పరుచూరి అన్నారు. కానీ ఈ చిత్రంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. వినయ విధేయ రామ ఎంత వసూలు చేసిందో నాకు తెలియదు కానీ.. రాంచరణ్ అభిమానులకు క్షమాపణలు కోరుతూ రాసిన లెటర్ ని తాను చదివానని పరుచూరి అన్నారు.

    సునీల్ దుర్మరణం అంటూ వార్తలు.. స్పందించిన హీరో, ఏం జరిగిందంటే!సునీల్ దుర్మరణం అంటూ వార్తలు.. స్పందించిన హీరో, ఏం జరిగిందంటే!

    మంచి విజయాలతో

    మంచి విజయాలతో

    దర్శకుడు బోయపాటి మంచి విజయాలతో రాణిస్తున్నారు. వినయ విధేయ రామ చిత్రంలో జరిగిన పొరపాట్లని ముందుగా గమనించి ఉంటే ఈ చిత్రం ఇంకాస్త బెటర్‌గా రాణించి ఉండే అవకాశాలు ఉన్నాయని పరుచూరి అభిప్రాయపడ్డారు. సస్పెన్స్, సెంటిమెంట్ ఒక ఒరలో ఇమిడే అంశాలు కాదు. కాబట్టి స్నేహ, ప్రశాంత్ పాత్రల్లో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది అని పరుచూరి అన్నారు. అన్నయ్య చనిపోయిన విషయాన్ని ఒక్క స్నేహ పాత్రకు తప్ప మిగిలినవారందరికి తెలిసేలా స్క్రీన్ ప్లే సెట్ చేసి ఉండాలి.

     కాస్త గందరగోళం

    కాస్త గందరగోళం

    ఒక్కసారిగా ఆడియన్స్‌ని ఎమోషన్‌కు గురు చేయడం కష్టం. అందువలన ముందునుంచి ఆసక్తి పెరిగేలా అన్నయ్య పాత్ర చనిపోయినట్లు రివీల్ చేసి ఉండాల్సింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బీహార్‌లో జరుగుతున్నాయా, వైజాగ్‌లో జరుగుతున్నాయా అనే గందరగోళం ఉందని అన్నారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ కథకు అడ్డం వచ్చినట్లుగా అనిపించాయి.

    English summary
    Paruchuri Gopala Krishna About Ram Charan's Vinaya Vidheya Rama Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X