For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అద్భుతమైన చరిత్ర మా ఇద్దరిది, మా మొదటి సినిమా ఖైదీ కాదు: ఈ వారం పరుచూరి పలుకుల్లో చిరంజీవి

  |

  టాలీవుడ్‌కు ఎన్నో సక్సెస్‌ఫుల్ కథలను అందించిన పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వందల సంఖ్యలో సినిమాలకు పనిచేసిన ఆయన తన అనుభవాన్ని అందరికీ పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'పరుచూరి పలుకులు' పేరుతో దర్శకత్వం, నటన, రచన సంబంధిత విషయాలను ఆసక్తికరంగా వీడియోల రూపంలో ఈ తరం వాళ్లకు అందిస్తున్నారు. అలా ఈ వారం "పరుచూరి పలుకుల్లో" మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చెప్పిన మాటలు ఇవీ.

   అద్భుతమైన చరిత్ర మా ఇద్దరిది

  అద్భుతమైన చరిత్ర మా ఇద్దరిది

  ఆయన గురించి ఒక్కసారి ఇలా ఆలోచించగానే ఆయనతో చేసిన 25 సినిమాలు గుర్తొస్తుంటాయి. ఘరానా మొగుడు, ఖైదీ, అడవిదొంగ, కొండవీటిదొంగ, గ్యాంగ్‌లీడర్ ఇలా ఒక అద్భుతమైన చరిత్ర మా ఇద్దరిది. అయితే ఒక ఆడియో ఫంక్షన్‌లో చెప్పినట్లుగా చిరంజీవిగారిని మొట్టమొదటిసారి చూసింది వీనస్ లాడ్జ్ పక్కన. 1978లో మేము రాసిన సంచలనం సినిమా రిలీజ్ తర్వాత మరో సినిమా రాయడానికి వీనస్ లాడ్జ్ వైపు వెళుతున్నాం.

   ఆరోజున గమనించాం

  ఆరోజున గమనించాం

  వర్షం పడుతుంది. అప్పుడే లాల్చీ వేసుకున్న ఓ అందమైన యువకుడు అలా వెళుతున్నాడు. అప్పుడే చూశాం. నేను, సత్యనారాయణగారు. కుర్రాడు భలే ఉన్నాడండీ..! అనుకున్నాం. ఆరోజున గమనించాం. ఈయన మాములు వాడు కాదు, గొప్పవాడు కాబోతున్నాడని. ఆరోజు స్పురద్రూపిలా కనిపించిన ఆయన్ని ఈ రోజు కోట్ల మంది ఎదురుగా చూస్తున్నారు.

  మొదటి సినిమా ఖైదీ కాదు

  మొదటి సినిమా ఖైదీ కాదు

  మేము చిరంజీవికి రాసిన మొదటి సినిమా ఖైదీ అనుకుంటారు కానీ అంతకంటే ముందే "రోషగాడు" రాశాం. రోషగాడు, ఖైదీ, సంఘర్షణ ఇలా మూడు సినిమాలు వరుసగా ఉండేవి. ఆయన వ్యక్తిగా ఎందుకు చాలా ఇష్టం అంటే, ఎదుటి మనిషి భావాన్ని ముందు ఆయన గౌరవిస్తాడు. లెనిన్ బొమ్మని రష్యా నుండి ఆయన నాకోసం కొనితెచ్చాడు. ఇంద్ర సినిమాలో ఓ సీన్ మళ్లీ రాయాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో మేము షిరిడి వెళుతున్నాం.

  ఆ సీన్ రాయడం నా వృత్తి

  ఆ సీన్ రాయడం నా వృత్తి

  అయితే వృత్తి కూడా దైవంతో సమానమే కదండి అంటే, అప్పుడు అన్నయ్యని షిరిడి పంపించి, నేను ఆ సీన్ రాశాను. ఇంద్రసేనా రెడ్డి మళ్లీ సీమలోకి రీ ఎంట్రీ ఇచ్చాక వచ్చే సీన్ అది. రాననుకున్నారా, రాలేననుకున్నారా అనే సీన్. వెంటనే దత్తుగారిని పిలిచి ఆయన చేతిలో ఉన్న ఫోన్ వంటిది నాకు తీసుకురావాలని పంపించారు. ఆ సీన్ రాయడం నా వృత్తి. నాకు ఫోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నీవు దైవ దర్శనానికి వెళ్లకుండా ఆగిపోయావంటూ ఆయన చూపించిన ప్రేమ ఉందే అది చిరంజీవి.

  చిన్నబ్బాయ్ అంటూ ఫోన్ చేశారు

  చిన్నబ్బాయ్ అంటూ ఫోన్ చేశారు

  నన్ను అప్పుడప్పుడు చిన్నబ్బాయ్ అని, అన్నయ్యని పెద్దబ్బాయ్ అని పిలిచేవారు. ఇంద్రలో మరో సీన్‌ మేనల్లుడిని ఖాన్ సాబ్ కొట్టే సీన్ జరుగుతోంది. అప్పుడు చిన్నబ్బాయ్ అంటూ ఫోన్ చేశారు. ఆ సీన్‌లో తను దెబ్బలు తిని వెళ్లిపోతే ఫ్యాన్స్ హర్టవుతారని, అక్కడే ఏదైనా డైలాగ్ రాయండి మళ్లీ ఫోన్ చేస్తాను అని పెట్టేశారు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నాను..లేదంటే అనే డైలాగ్ చెప్పగానే ఆయన ఎదురుగా ఉంటే కౌగిలించుకునేవాడిని అన్నారు. అక్కడ కూడా నా డ్యూటీ నేను చేశా. ఆయన అక్కడ అంత మాట అనాల్సిన అవసరం లేదు.

  వ్యవస్థగా కూడా

  వ్యవస్థగా కూడా

  ఇక చిరంజీవి గురించి చెప్పకోవాలంటే ఆయన మనిషిగా, వ్యక్తిగా ఎంత గొప్పవాడో, వ్యవస్థగా కూడా అంతే గొప్పవాడు. రక్తదానం, నేత్రదానం అంటూ ఒక వ్యవస్థగా మారిన ఘనత ఆయనది. రక్తదానం ఆయన చేయడమే కాకుండా అభిమానులను కూడా ఇందులో భాగం చేసిన మహానుభావుడు చిరంజీవి. అందుకు ఆయనంటే నాకు బాగా ఇష్టం

  నన్ను ఎప్పుడూ కామ్రెడ్ అని పిలుస్తారు

  నన్ను ఎప్పుడూ కామ్రెడ్ అని పిలుస్తారు

  ఇంకొకటి ఏమిటంటే వాళ్ల నాన్నగారు నన్ను ఎప్పుడూ కామ్రెడ్ అని పిలుస్తారు. బహుశా అది వినే లెనిన్ బొమ్మని చిరంజీవిగారు తెచ్చారేమో..! నాకు మోకాలు ఇబ్బందిగా ఉన్న సమయంలో డాక్టర్లు అసలు నన్ను నడవద్దన్నారు. అప్పుడు చిరంజీవి గారు ఒక వ్యాయామం నేర్పి, అది చేస్తున్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడా పేపరుపై రాసి ఇచ్చారు... ఈ రోజు నేను 5 అంతస్తులనైనా ఈజీగా ఎక్కేస్తాను.

   1986లో సిగరెట్ మానేశాను

  1986లో సిగరెట్ మానేశాను

  అలాగే నేను 1986లో సిగరెట్ మానేశాను. అంతకు ముందు అన్నయ్యకి, నాకు ఇద్దరికీ ఆ అలవాటు ఉంది. మా అన్నయ్య సిగరెట్ మానేయడానికి కూడా చిరంజీవిగారే కారణం. కొడుకుకి అలా అయింది. ఆ కొడుకు కోసం ఈ సిగరెట్ మానేయలేరా? అన్నారు అంతే, అన్నయ్య సిగరెట్ మానేశాడు. అందుకే చెబుతారు. నీకు సామ్రాజ్యాలు ఉన్నా లేకపోయినా పరవాలేదు. మంచి సలహా ఇచ్చే మిత్రుడు పక్కన ఉంటే అంతకు మించిన వరం మరొకటి లేదు అని.

  సార్.. యు ఆర్ గుడ్ ఎట్ హార్ట్

  సార్.. యు ఆర్ గుడ్ ఎట్ హార్ట్

  సార్.. యు ఆర్ గుడ్ ఎట్ హార్ట్. యు ఆర్ గోల్డ్ ఎట్ హార్ట్. మీ అభిమానులు, మన అభిమానులు మీరు చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం వేచిచూస్తున్నారు. ఆడియో ఫంక్షన్ తర్వాత నుండి ఆ సినిమా కోసం నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తారు. మీ నట జీవితంలో ఆ చిత్రం ఓ కళికితురాయిగా మిగిలిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో అద్భుతమైన సినిమాలున్నాయి మీకు. కానీ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అని ముగించారు.

  English summary
  Paruchuri Gopala Krishna Interesting Comments on Chiranjeevi in this week "paruchuri Palukulu" the you Tube Channel Gopala Krishna Shares His Experiences in Film Industry
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X