»   » వివాదంలో ‘పటాస్’ పోస్టర్, కేసు నమోదు

వివాదంలో ‘పటాస్’ పోస్టర్, కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘పటాస్' మూవీ హిట్ టాక్ తో సాఫీగా మంచి కలెక్షన్లు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై కేసు నమోదైంది. ఈ చిత్ర పోస్టర్ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని కించ పరిచే విధంగా ఉందని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో బిజేపీ నాయకుడు డోర్నాల జయప్రకాష్ ఫిర్యాదు చేసారు.

అదే విధంగా పోస్టర్లలో అర్దనగ్నంగా ఉన్న మహిళ జాతీయ చిహ్నమైన మూడు సింహాపై చేయి వేసి నిల్చోవడం యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, పోస్టర్లో హీరో పొగత్రాగుతూ కనిపించడం వల్ల కూడా యూత్ తప్పదోవ పట్టే అవకాశం ఉందని జయప్రకాష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
పటాస్ సినిమా విషయానికొస్తే...
కళ్యాణ్ రామ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పటాస్' మూవీ కలెక్షన్ పరంగా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నటించిన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు ఈచిత్రం శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయి. ఓ లీడింగ్ ఛానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. కళ్యాణ్ రామ్ సినిమాకు ఇంత రావడం అంటే షాకే మరి.

Pooja Gandhi to make a comeback in politics

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ...‘హిట్' అనే మాట కోసం దాదాపు పదేళ్ల నుండి నిరీక్షించాను. మధ్యలో ‘హరే రామ్' సినిమా బాగా ఆడినా ‘పటాస్' అంత సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. మధ్యలో నాకు సినిమా తప్ప మరేం తెలియదు. అందుకే ఈ రంగాన్నే నమ్ముకుని ముందుకు సాగుతున్నాను అని తెలిపారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే మాటను నమ్ముతాను. అందరూ కలిసి ఓ కుటుంబంగా ఉంటే ఉండే బలమే వేర. అన్నయ్య జానకిరామ్ మరణం మా కుటుంబం పెద్ద అండ కోల్పోయింది. అన్నయ్యకు పటాస్ హిట్టవుతుందని బలమైన నమ్మకం ఉండేది. ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన రోజు సినిమా బావుంటుంది, హిట్టవుతుందని చెప్పారు. ఈ విజయాన్ని ఆస్వాదించడానికి ఆయన లేక పోవడం చాలా బాధగా ఉంది అన్నారు.

English summary
A complaint was lodged in Chaitanyapuri police station stating that the movie poster insults the national emblem. The three lions of our emblem have been insultingly depicted in the movie poster according to the complainant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu