»   » ‘పటేల్ సర్’ టైటిల్ సాంగ్ టీజర్... జగ్గూభాయ్ స్టైల్ అదుర్స్

‘పటేల్ సర్’ టైటిల్ సాంగ్ టీజర్... జగ్గూభాయ్ స్టైల్ అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడి పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు.... తర్వాత హీరో నుండి విలన్ గా టర్న్ అయ్యారు. విలనిజంలో తనదైన ముద్రవేశారు.


చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ హీరోగా రాబోతున్నాడు. అయితే ఇందులో ఆయన పాత్ర కాస్త విలన్ లక్షణాలతో ఉండటమే ఈ సినిమా ప్రత్యేకత. ఆ సినిమాయే 'పటేల్ సర్'. కేవలం క్యారెక్టర్లోనే కాదు... లుక్ పరంగా కూడా ట్రెండీగా కనిపింబోతున్నాడు జగపతి.


వారాహి స్టూడియోస్ బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాసు పరిమి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా టైటిల్ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు.


Patel S.I.R

ఒంటి నిండా టాటూలు, తెల్లజుట్టు, గడ్డంతో స్టైలిష్, రఫ్‌ లుక్‌తో జగ్గూభాయ్ ఇరగదీసేశాడనే చెప్పాలి. బుల్లెట్‌పై స్టైలిష్‌గా వస్తూ ఏజ్ బారైన గ్యాంగ్‌స్టర్‌లా మెప్పించబోతున్నాడు. జగపతి కెరీర్లో ఈ చిత్రం ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి డిజె వసంత్ సంగీతం అందిస్తున్నారు.


English summary
Here comes the Title Track - Patel Patel Song Teaser of Jagapthi babu's Upcoming intense action thriller Patel S.I.R. The Movie is Presented by Sai Shivani, and is a Sai Korrapati Production
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu