For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?

  |

  కొంతమంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ కు వచ్చేసరికి చాలా వరకు సింపుల్ ఫ్యామిలీ రోల్స్ తోనే ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే సీనియర్ నటి పవిత్ర లోకేష్ కూడా మొన్నటి వరకు మదర్ రోల్స్ తో బాగానే ఎట్రాక్ట్ చేసింది. అయితే రీసెంట్ గా ఆమె చేసిన ఒక బోల్డ్ రోల్ గురించి తెలుసుకున్న ఆడియెన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

  హైట్ చూసి భయపడిన హీరోలు

  హైట్ చూసి భయపడిన హీరోలు

  కన్నడ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్ గా ట్రై చేసిన పవిత్రకు భారీ స్థాయిలో ఆఫర్స్ వచ్చాయి. అప్పట్లో పవిత్ర హైట్ హీరోలను కూడా డామినేట్ చేసేది. హైట్ అలాగే అందంతో 90లో ఉన్న హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇచ్చింది. కానీ కొన్ని సందర్భాల్లో ఆమె హైట్ ఎక్కువగా ఉండడం వలన ఓ వర్గం హీరోలు తాము పొట్టిగా కనిపిస్తామని ఆమెతో నటించడానికి ఒప్పుకోలేదు.

   రేసుగుర్రం సినిమాతో..మంచి క్రేజ్

  రేసుగుర్రం సినిమాతో..మంచి క్రేజ్

  పవిత్ర కేవలం కన్నడలోనే కాకుండా తమిళ్, మలయాళం అలాగే తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది. ఆమె హీరోయిన్ గా నటించినప్పటి కంటే సపోర్టింగ్ రోల్స్ ద్వారానే ఎక్కువగా క్రేజ్ అందుకున్నారు. ముఖ్యంగా మదర్స్ రోల్స్ ద్వారా ఆమెకు మంచి క్రేజ్ దక్కింది. రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ కు తల్లిగా నటించిన విషయం తెలిసిందే.

  ఏడాదికి నాలుగైదు సినిమాలు..

  ఏడాదికి నాలుగైదు సినిమాలు..

  కాటమరాయుడు, s/o సత్యమూర్తి, దువ్వడా జగన్నాథమ్, పటాస్, టెంపర్, పండగ చేస్కో, సైరా వంటి సినిమాలలో ఆమె చేసిన పాత్రలకు మంచి క్రేజ్ దక్కింది. ఏడాదికి నాలుగైదు సినిమాలకు తక్కువ కాకుండా బిజీగా ఉంటున్నారు. అవకాశం వస్తే సీరియల్స్ లో కూడా చేస్తున్నారు. పవిత్ర లోకేష్ కోసం కొందరు దర్శకులు స్పెషల్ గా సెంటిమెంట్ రోల్స్ క్రియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

  40ప్లస్ లో..సిగరేట్ తాగుతూ

  40ప్లస్ లో..సిగరేట్ తాగుతూ

  నాలుగు పదుల వయసులో ఉన్న పవిత్ర లోకేష్ అనగానే ఎక్కువగా మదర్స్ రోల్స్ తో ఆకట్టుకుంటుందని అందరికి తెలిసిందే. అయితే ఇటీవల రెడ్ సినిమాలో ఆమె చేసిన పాత్ర ఆడియెన్స్ ను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఏకంగా సిగరేట్ తాగుతూ బోల్డ్ గా మాట్లేసింది. అమ్మ పాత్రల్లో నటించిన పవిత్ర అలాంటి పాత్రలో చూసేసరికి జనాలు థ్రిల్ అవ్వడం కంటే ముందు షాక్ అయ్యారని తెలుస్తోంది.

  రియల్ లైఫ్ లో సిగరెట్..

  రియల్ లైఫ్ లో సిగరెట్..

  ఇక రియల్ లైఫ్ లో కూడా పవిత్ర లోకేష్ అలానే ఉంటారా అని సందేహాలు ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో పవిత్ర అసలైన వివరణ ఇచ్చింది. రియల్ లైఫ్ లో అసలు సిగరెట్ కూడా ముట్టుకొను పాత్ర కొత్తగా ఉండాలని కథకు తగ్గట్లు అలా చేయాల్సి వచ్చిందని కూల్ గా వివరణ ఇచ్చింది. రెడ్ సినిమా చూసిన చాలా మంది పవిత్ర లోకేష్ పాత్ర గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు.

  BigG Boss 3 Telugu : Tamanna Simhadri Wildcard Entry ! || Filmibeat Telugu
   ఇక ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే..

  ఇక ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే..

  ఇక నిన్నటివరకు తల్లి పాత్రలు చేస్తూ చాలా సింపుల్ గా కనిపించిన పవిత్ర లోకేష్ సడన్ గా సిగరెట్ లాగిస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడింది అంటే రెమ్యునరేషన్ డోస్ కూడా గట్టిగానే పెంచి ఉండవచ్చని టాక్ వస్తోంది. ఆ బోల్డ్ పాత్రకు సంబంధించిన సీన్స్ ను మూడు రోజుల్లో ఫినిష్ చేశారట. ఇక సాధారణంగా 60వేల వరకు డైలీ పేమెంట్ అందుకునే పవిత్ర ఆ పాత్రకు మాత్రం డబుల్ పేమెంట్ తీసుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

  English summary
  Some senior heroines try to impress with their simple family roles when it comes to the second inning. Also, senior actress Pavithra Lokesh has done well with mother roles till now. However, the audience was shocked to learn about a bold role she recently played.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X