ఇది కోన వెంకట్ గిప్ట్ : పవన్ పుట్టిన రోజు స్పెషల్ సాంగ్ (వీడియో)
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఈ రోజు. దాంతో అభిమానులంతా ఉత్సవంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో పవన్ మిత్రుడు,అభిమాని అయిన కోన వెంకట్ ఓ పాటను రాసి తను రచన చేస్తున్న ‘శంకరాభరణం' టీమ్ తరుపున విడుదల చేసారు. ఆ పాటను మీరు ఇక్కడ చూడండి. అంతేకాకుండా పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘శంకరాభరణం' టీమ్ ఓ పోస్టర్ ని సైతం విడుదల చేసింది. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇక ఈ పాట విషయాన్ని తెలియచేస్తూ గోపి మోహన్ ఓ ట్వీట్ చేసింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
‘శంకరాభరణం' చిత్రం విషయానికి వస్తే...
కోన వెంకట్ ఓ చిత్రాన్ని నిర్మించటానికి రెడీ అవుతునున్నారు. ఈ సారి ఆయన హీరో నిఖిల్ తో ముందుకు వెళ్తున్నారు.‘శంకరాభరణం' టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది బీహార్ నేపధ్యంలో క్రైమ్ ప్రధానంగా సాగే థ్రిల్లర్.
ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం అనే అతను దర్శకుడుగా పరిచయం అవ్వనున్నారు. అలాగే ప్రవీణ్ లక్కిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు.

నిఖిల్ బాడీ లాంగ్వేజికి తగిన విధంగా కోన వెంకట్ కథ తయారు చేసారని అంటున్నారు. పూర్తి వినోదాత్మకంగా సాగే కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఉంటూనేై క్రైమ్ ఎలిమెంట్ ఈ చిత్రంలో ఉండనుంది. సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తానరి తెలుస్తోంది. ఆయన కోసం కోన వెంకట్ స్పెషల్ క్యారెక్టర్ క్రియేుట్ చేసినట్లు తెలుస్తోంది. కధల ఎంపికలో నిఖిల్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు.
కోన వెంకట్ మాట్లాడుతూ -''నాటి 'శంకరాభరణం'కీ, ఈ 'శంకరాభరణం'కీ ఎలాంటి పోలికా ఉండదు. బీహార్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ కథకు ఈ టైటిలే బాగుంటుందని పెట్టాం. మనుషులు వెళ్లడానికి కూడా భయపడే ప్రమాదకరమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నాం. హీరోగా, నటుడిగా నిఖిల్ స్థాయిని పెంచే చిత్రం అవుతుంది'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ -''ఈ చిత్రకథ అద్భుతంగా ఉంటుంది. మే రెండో వారంలో షూటింగ్ ప్రారంభించి, దసరాకి చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్.


Click it and Unblock the Notifications











