‘యాక్షన్’ 3డిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం!
తాజాగా అల్లరి నరేష్ హీరోగా అనిల్ సుంకర దర్శకత్వంలో వచ్చిన 'యాక్షన్' 3డి సినిమాపై పవన్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఈ చిత్రంలో రెండు గొరిల్లాల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్‌కు గబ్బర్ సింగ్ చిత్రంలోని 'ఆకాశం అమ్మాయైతే' అనే సాంగును వాడారు. అలాంటి సీన్‌కు ఈ పాటను వాడటం చాలా చీప్‌గా కొందరు అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.
భవిష్యత్‌లో పవన్ పేరును, ఆయన సినిమాల్లోని సీన్లు, సాంగులను విచ్చలవిడిగా వాడకుండా.....ఏదైనా చేయాలనే ఆలోచనలో కొందరు అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగబోతోందో చూడాలి. కాగా....ఆ సినిమా నిర్మాతలు, హీరోకు, దర్శకులకు లేని నొప్పి అభిమానులకు ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే....'పవనిజం' కాన్సెప్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు అభిమానులు తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ 'పవనిజం' పేరుతో టీషర్టులు కూడా రెడీ అయ్యారు. అభిమానులు వాటిని వేసుకుని తిరుగుతూ 'పవనిజం' కాన్పెప్టు సామాన్య జనాల్లోకి కూడా దూసుకెళ్లేలా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












