»   » నో గొడవ, పవన్ బాబాయ్ ఫ్యాన్స్ కూడా..: వరుణ్ తేజ్

నో గొడవ, పవన్ బాబాయ్ ఫ్యాన్స్ కూడా..: వరుణ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూరి జగన్నాధ్ తీరుతో పవన్ కళ్యాణ్ అభిమానులు హర్ట్ అయ్యారని, ఆ కారణంతోనే ‘లోఫర్' మూవీ వారు బహిష్కరించాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు వరుణ్ తేజ్. పవన్ బాబాయ్ ఫ్యాన్స్ కూడా సినిమా చూస్తున్నారని స్పష్టం చేసారు.

‘అభిమానులందరూ సినిమా లవర్సే...వారు ప్రత్యేకంగా ఒక హీరో అభిమానులే అయినా... ఇతర హీరోల సినిమాలు కూడా చూస్తారు. సినిమా బావుంటే ఆదరిస్తారు' అని స్పష్టం చేసారు. పవన్ బాబాయ్ ఫ్యాన్స్ కూడా లోఫర్ సినిమా చూస్తారు. లోఫర్ సినిమాకు సంబంధించి గొడవ ఏమీ లేదు. వారి మనసులో అలాంటిదేమీ ఉండదు అన్నారు.

Pawan Fans Will Watch: Varun Tej

లోఫర్ ఆడియో ఫంక్షన్ జరుగకుండా కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లరి చిల్లరగా వ్యవహరించడంపై పూరి స్పందించారు. ‘అలాంటి పనులు చేస్తే.... ఎవ‌రికైనా చిరాగ్గానే ఉంటుంది. ఎంతో ఖ‌ర్చుపెట్టి ఫంక్ష‌న్ చేసి, మా సినిమా గురించి నాలుగు మాట‌లు చెప్పాల‌ని అనుకున్నాం. వారు అరవడం మూలంగా ఎవ‌రూ మాట్లాడాల‌నుకున్న‌ది మాట్లాడ‌లేక‌పోయాం. ఫ్యాన్స్ కి క‌ల్యాణ్ గారు చెప్పాలి, ఆయనైతేనే వారిని కంట్రోల్ చేయగలరు. ఇలాగే వదిలేస్తే పవ‌న్‌గారి ఫ్యాన్స్ కి కామ‌న్ సెన్స్ లేద‌ని అంతా అనుకుంటారు. అరిచి ప‌రువు తీయ‌కండ్రా అని క‌ల్యాణ్ గారు చెప్పాలి. ఏ ట్విట్ట‌ర్‌లోనో ఆయ‌న దీని గురించి రాస్తే బావుంటుంది' అని పూరి జగన్నాధ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

రేపు(డిసెంబర్ 17)న లోఫర్ విడుదలవుతోంది. వరుణ్‌తేజ్‌, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌, టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.ఎ.కుమార్‌ వర్మ, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కె.యస్‌.రాజు, గల్లా రమేష్‌, కిషోర్‌ కృష్ణ, కో డైరెక్టర్‌: శివరామకృష్ణ, కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌, ఫైట్స్‌: విజయ్‌, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, నిర్మాతలు: సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
"All fans are vitally cinema lovers. Only after they kick off watching films, they become fans for certain hero. Any hero's fans will surely watch other hero's films too. Content will drive a film towards hit status. Pawan baabai's fans will surely watch the film. They don't have such things on their mind", says Varun Tej
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu