»   »  రేణుకు రిక్వెస్ట్, పవన్ కళ్యాణ్ సాయం, లక్ష్మి ధాంక్స్

రేణుకు రిక్వెస్ట్, పవన్ కళ్యాణ్ సాయం, లక్ష్మి ధాంక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ చట్టబద్దంగా విడిపోయినా పిల్లల కోసం రెగ్యులర్ గా కలుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు చిన్న మనస్పర్దలతో విడిపోయిన ఈ జంట మధ్యన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది అనటానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. రీసెంట్ గా రేణు దేశాయ్ ని ఓ అమ్మాయి సాయం కోసం రిక్వెస్ట్ చేస్తే పవన్ ముందుకొచ్చి చేసాడు. ఆ వివరాలు క్రింద చదవండి.

Pawan help to a student named Lakshmidurga Degala


లక్ష్మి దుర్గా డేగల అనే అమ్మాయి డిగ్రీ చదువుకుంటోంది. ఆమె తండ్రి ఈ మధ్యనే మరణించాడు. దాంతో ఆమె తన చదువుకు ఫీజు కట్టలేని పరిస్దితి ఏర్పడింది. దాంతో ఆమె సోషల్ మీడియాలో తన పరిస్దితిని వివరిస్తూ సాయం అర్దించింది. అయితే అక్కడ ఎవరినుంచీ రెస్పాన్స్ రాలేదు.

దాంతో ఆమె ట్విట్టర్ ద్వారా రేణు దేశాయ్ కు తన పరిస్దితిని వివరిస్తూ కాంటాక్ట్ చేసింది. దానికి స్పందించిన రేణు దేశాయ్...తన మేనేజర్ ద్వారా అమ్మాయి వివరాలు సేకరించింది. ఆ తర్వాత ఆ వివరాలు తీసుకుని పవన్ కళ్యాణ్ మేనేజర్ ఒకరు ఆ అమ్మాయిని కలిసి ఫీజు చెల్లించారు. దాంతో ఆమె పవన్, రేణులకు ట్విట్టర్ ద్వారా ధాంక్స్ చెప్పింది.

ఇక రేణు దేశాయ్ ఈ ట్వీట్ పై స్పందిస్తూ బాగా చదువుకుని మీ తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకుని రమ్మని విషెష్ చెప్పింది.

English summary
Renuudesai Retweeted Lakshmidurga Degala who got help from pawan. "Study well and make your parents proud. That will make me happy! Best of luck for your future :)"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu