»   » త్రివిక్రమ్‌కు ఖరీదైన కారు గిఫ్టుగా ఇస్తున్న పవన్!

త్రివిక్రమ్‌కు ఖరీదైన కారు గిఫ్టుగా ఇస్తున్న పవన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'అత్తారింటికి దారేది' ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు పవర్ స్టార్ ఖరీదైన స్కోడా కారు గిఫ్టుగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవర్ స్టార్ ఈ కారును కొనుగోలు చేసారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. అందులో స్కోడా మేనేజర్ నుంచి పవన్ కళ్యాణ్ కారు పత్రాలు అందుకుంటున్నారు.

పవర్ స్టార్-త్రివిక్రమ్ మధ్య కేవలం హీరో-దర్శకుడు సంబంధం మాత్రమే కాకుండా.....అంతకు మించి వీరి మధ్య ఆత్మీయమైన స్నేహ బంధం ఉంది. ఇటీవల 'అత్తారింటికి దారేది' ఆడియో వేడుకలో పవర్ స్టార్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఆ ఇష్టంతోనే పవన్ కళ్యాణ్ కారు గిఫ్టుగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...'నేను మీలాంటి మనిషినే. నాకు బాధలు ఉంటాయి. జల్సా చేస్తున్న సమయంలో నాకు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు త్రివిక్రమ్ నాకు ఎంతో భరోసా ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఓదార్పును ఇచ్చాయి. ఆయన నాకు ఎంత భరోసా ఇచ్చారు. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చారు.

పవన్ కల్యాణ్, సమంత జంటగా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న 'అత్తారింటికి దారేది' అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఆగస్టు 7న విడుదలకు ముస్తాబవుతోంది. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Film Nagar source said that, Pawan kalyan has bought a new car. That Pawan is going to gift the car skoda superb to none other than Trivikram Srinivas whom he is going to work with next film. Here is the picture showing Pawankalyan recieving billing documents of car from skoda manager.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu