»   » అన్నయ్యకు నచ్చనివి చేసా, ఆయన షూ సువాసనే అనిపించేది: పవన్ కళ్యాణ్

అన్నయ్యకు నచ్చనివి చేసా, ఆయన షూ సువాసనే అనిపించేది: పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ ఆడియో వేడుకలో అన్నయ్య గురించి తన మనసులో ఉన్నదంతా బయటకు చెప్పారు. గతంలో అన్నయ్య చిరంజీవి గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదనే చెప్పాలి. ఆయన నాకు అన్నయ్య మాత్రమే కాదు నా జీవితం ఇలా ఉండటానికి కారణం ఆయనే, నాకు స్పూర్తినిచ్చిన వ్యక్తి అన్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్


పవన్ మాట్లాడుతూ...'నాకు హీరో అంటే చిరంజీవిగారే. అమితాబ్ బచ్చన్ అంటే పిచ్చి ఇష్టముండేది. అన్నయ్య హీరో అయిన తర్వాత ఆయనే నాకు కనిపించాడు. ఈరోజు నేను యాక్టర్ గా మారి మీ ముందున్నానంటే కారణం అన్నయ్య వదినలే కారణం. ఎవరైనా అతిథులు వస్తే ఇంట్లో దాక్కునేవాడిని. అలాంటి నన్ను మీ మధ్యలోకి నెట్టేశారు. నాకు అన్నయ్యంటే ఎంతిష్టమో బయటెందుకు చెప్పుకోవాలని అనుకుంటాను' అన్నారు.


ఫోటో గ్యాలెరీ : సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్


'నేను ఇంట్లో కూర్చొని ఏ పనిచేయకుండా తింటుంటే అన్నయ్య రాత్రిపగలు కష్టపడి, కంఫర్ట్ బుల్ షూస్ లేకపోయినా అవి వేసుకోవడంతో కాళ్లు వాచిపోయేవి. నేను అన్నయ్య దగ్గరకెళ్ళి షూ తీసినప్పుడు ఆ చెమటలో నాకు ఓ వ్యక్తి తాలుకు సువాసన కనిపించేది. నాలాంటి వాడికి సినిమాల్లో రావడం తేలిక. ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి అందరికీ ఆదర్శవంతంగా, స్ఫూర్తిగా నిలిచారు. ఒక ఆలోచన, ధ్యేయాన్ని అనుకుంటే సాధించగలరని అన్నయ్యను చూసి తెలుసుకున్నాను. ఆయన నాకు అన్నయ్య కంటే స్ఫూర్తినిచ్చిన మహావ్యక్తి' అన్నారు.


Pawan Kalyan about Chiranjeevi

'సినిమాల్లో యాక్ట్ చేయాలని లేదు. కథలు చదవడం ఇష్టం. నన్ను సినిమాల్లో యాక్ట్ చేయమంటే ఆయనకు చెడ్డ పేరు తీసుకురాకూడదని ఒళ్లు దగ్గర పెట్టుకుని ఎక్కువగా పనిచేయాల్సి వచ్చింది. అన్నయ్యతో పాలిటిక్స్ పరంగా ఆయనకు నచ్చనివి చేశాను. అదెందుకు చేశానో ఆయనకు చెప్పాను. ఆయన అర్థం చేసుకున్నారు కూడా. మా బంధం వేరు. రాజకీయాలు వేరు. అవి రెండు దారులు. నేను అన్నయ్య పంథాలో లేకపోయినా ఆయనంటే ఎంతిష్టమో నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు' అన్నారు.


'సమయం వచ్చినప్పుడు నేనెంత నిలబడగలనో నాకు తెలుసు. నా తల్లిదండ్రుల తర్వాత అన్నయ్య వదినలే తల్లిదండ్రులు. అన్నయ్యకు కమర్షియల్ సినిమాలంటే ఇష్టం. అన్నీ ఉంటూనే అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఉండాలనుకుంటారు. అలాంటి సినిమా ఇది అవుతుందని నేను అనుకుంటున్నాను. అందకే ఈ వేడుకకు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాను' అన్నారు.

English summary
Pawan Kalyan heartful speech about Chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu