»   » ‘నేను శత్రువు మీద చేసే యుద్ధం’ అంటూ పవన్ గురించి త్రివిక్రమ్!

‘నేను శత్రువు మీద చేసే యుద్ధం’ అంటూ పవన్ గురించి త్రివిక్రమ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అ..ఆ' చిత్రం ఆడియో వేడుక సోమవారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓ రేంజిలో పొగిడేసాడు.

పవన్ మీద త్రివిక్రమ పొగడ్తలు ఇలా సాగాయి...

కొండ ఒకరికి తలొంచి ఎరుగదు...
శిఖరం ఒకరికి సలాం అని తలొంచి ఎరుగదు..
కెరటం అలసి పోయి ఒకరికోసం ఎప్పుడూ ఆగదు..
తుఫాన్ ఒకడి ముందు తలొంచి ఎరుగదు...
నాకిష్టమైన స్నేహితుడు...
నా సునామీ... నా ఉప్పెన..
నేను దాచుకున్న నా సైన్యం...
నేను శత్రువు మీద చేసే యుద్ధం...
నేను ఎక్కు పెట్టిన బాణం...
నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం...
నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు..
ఎంతో మంది గుండెలు తడపడానికి వచ్చిన ఒక చిన్న వర్షపు చినుకు..
స్నేహ రుతుపవనం పవన్ కళ్యాణ్
వెనకాలే వస్తారా...తోడుగా ఉందాం వస్తారా

అంటూ తనకు ఇష్టమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ తన మనసులోని భావాలను వ్యక్త పరిచారు. త్రివిక్రమ్ గురించి పవన్ కళ్యాన్ చెప్పిన విషయాలు స్లైడ్ షోలో...

గోకుళంలో సీత సమయంలో

గోకుళంలో సీత సమయంలో

త్రివిక్రమ్ గారు...నేను మంచి స్నేహితులం అంటుంటారు. నేను గోకుళంలో సీత సినిమా చేసేటప్పుడు ఆయన అసిస్టెంట్ రైటర్. అసిస్టెంట్ అని తెలుసు కానీ పేరు కూడా తెలియదు అప్పటికీ అన్నారు పవన్.

పిలిపించాం

పిలిపించాం

ఒక రోజు పోసాని గారు లేక పోతే ఆయన అసిస్టెంటును పిలిపించి రాయిద్దామని చెప్పి అప్పుడు ఇద్దరం కలుసుకున్నాం అని తెలిపారు.

తొలి ప్రేమ

తొలి ప్రేమ

తొలి ప్రేమ సినిమా డబ్బింగ్ అయిపోయి వెళ్లిపోయేప్పుడు చిరు నవ్వు సినిమాకు సంబంధించి రెస్టారెంట్లో రషెస్ చూసి డైలాగులు విపరీతంగా నచ్చాయి. అప్పటి నుండి ఆయన తెలుసు. చాలా బాగారాసారని అనుకునే వాడిని.

అందుకే ఇష్టం

అందుకే ఇష్టం

ఆ రోజు నుండి మా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం, జల్సా దగ్గర నుండి మాకున్న పరిచయం కేవలం సినిమా తీయడమే కాదు, నిజజీవితంలో విలువలు పాటించే వ్యక్తి కాబట్టే ఆయనంటే చాలా ఇష్టం.

గౌరవ ప్రదంగా

గౌరవ ప్రదంగా

అందుకే మా ఇద్దరి మధ్య స్నేహం ఒకరికొకరు చాలా గౌరవ ప్రదంగా ఉంటుంది. ఆయనంటే ఎంత అభిమానం అంటే..... నటుడంటే కేవలం రైటర్ రాసిన డైలాగులను చెప్పేవాడే కానీ, రాసే వాడు కాదు.

అందుకే...

అందుకే...

రచయితలకు ఎందుకింత గౌరవం ఇస్తానంటే..ఒక్కోసారి హీరోలకు చాలా మంచి పేరు వస్తుంది.... దాని వెనక రచయిత, కథ ఉందని బలంగా నమ్ముతాను. త్రివిక్రమ్ లాంటి రచయిత తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నందుకు గర్వంగా ఉంది.

English summary
Checkout Pawan Kalyan and Trivikram Speech at A Aa Audio Launch.Pawan Kalyan and Trivikram Speech at A Aa Audio Launch
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu