»   » పవన్ కళ్యాణ్ అన్నవరం చెల్లమ్మ... తల్లయింది (ఫోటోస్)

పవన్ కళ్యాణ్ అన్నవరం చెల్లమ్మ... తల్లయింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తన కెరీర్లో చేసిన ఒకే ఒక సిస్టర్ సెంటిమెంట్ మూవీ 'అన్నవరం'. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లిగా సంధ్య నటించింది. కమర్షియల్ గా ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోయినా... బ్రదర్, సిస్టర్ సెంటిమెంటు బాగా పండింది ఈ మూవీలో.

ప్రేమిస్తే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంధ్య.... ఆ తర్వాత పలు సినిమాల్లో చేసినా పెద్దగా సక్సెస్ లేకుండా పోయింది. తర్వాత ఐటి ప్రొఫెషనల్ వెంకట్ చంద్రశేఖరన్ ను పెళ్లాడిన సంధ్య హౌస్ వైఫ్ గా సెటిలైంది. తాజాగా సంధ్య, వెంకట్ దంపతులు తల్లిదండ్రులయ్యారు.

ఇదిగో ఫోటోస్

ఇదిగో ఫోటోస్

తాజాగా సంధ్య, వెంకట్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. సంధ్యకు పాప పుట్టిన విషయాన్ని ఆమె స్నేహితురాలు సుజ వరుణి ట్విట్టర్‌ ద్వారా తెలియజేసారు.

సంధ్య వివాహం

సంధ్య వివాహం

2015 డిసెంబర్ 6న కేరళలోని ప్రముఖ గురువాయూర్ దేవాలయంలో వీరి జరిగింది. ఐటి ప్రొఫెషనల్ వెంకట్ చంద్రశేఖరన్ ను ఆమె వివాహమాడారు. వాస్తవానికి వీరి వివాహం చెన్నైలోనే ప్లాన్ చేసుకున్నారు. అయితే అప్పట్లో భారీ వర్షాలు, వరదల కారణంగా వివాహ వేదిక అప్పటికప్పుడు కేరళకు మార్చారు.

ప్రేమిస్తే..

ప్రేమిస్తే..

తమిళంలో వచ్చిన ‘కాదల్' సినిమా ద్వారా సంధ్య హీరోయిన్ గా పరిచయం అయింది. అదే సినిమా తెలుగులో ‘ప్రేమిస్తే'గా విడుదలైంది.

పవన్ కళ్యాణ్ తో తొలి మూవీ

పవన్ కళ్యాణ్ తో తొలి మూవీ

తెలుగులో ఆమె నేరుగా నటించిన తొలి చిత్రం పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అన్నవరం'. ఈ చిత్రంలో ఆమె పవన్ కళ్యాణ్ చెల్లి పాత్రలో నటించింది. తర్వాత హాసిని అనే చిత్రంలో నటించినా అది హిట్ కాలేదు.

ఇక్కడ తక్కువే

ఇక్కడ తక్కువే

టాలీవుడ్లో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే. తమిళం, మళయాలం చిత్రాల్లోనే సంధ్య ఎక్కువగా నటించారు.

English summary
"Very happy for my loveable friend Sandhya n Venkat as she blessed with baby girl ! My heartily wishes for you dear" Suja Varunee tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu