»   » హీరోగా చేస్తా, పవన్ కళ్యాణ్ నుండి మెసేజ్ వచ్చింది: దేవిశ్రీ

హీరోగా చేస్తా, పవన్ కళ్యాణ్ నుండి మెసేజ్ వచ్చింది: దేవిశ్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుకుమార్ అండ్ టీం తెరకెక్కించిన ‘కుమారి 21ఎఫ్' మూవీ యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది. అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ సినిమాను ప్రమోట్ చేసే పనిలో భాగంగా బీజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తాను ప్రస్తుతం సంగీతం కంపోజ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' గురించి కూడా మాట్లాడారు దేవిశ్రీ. తాను కంపోజ్ చేసిన ట్యూన్స్ విని పవన్ కళ్యాణ్ చాలా ఇంప్రెస్ అయ్యారని తెలిపారు. ముఖ్యంగా తాను కంపోజ్ చేసిన రొమాంటిక్ నంబర్ విని పవన్ అప్రిషియేట్ చేసినట్లు తెలిపారు.

DSP

‘ పవన్ కళ్యాణ్ కోసం చేసిన రొమాంటిక్ ట్యూన్స్ విన్న తర్వాత ఆయన నాకు చాలా పెద్ద టెక్ట్స్ మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా పీలయ్యాను. నాకు మరింత ఎనర్జీ వచ్చినట్లయింది' అన్నారు. ఎన్టీఆర్ కోసం చేస్తున్న ‘నాన్నకు ప్రేమతో' మూవీ బెస్ట్ మ్యూజిక్ అందిస్తానని తెలిపారు. ఎన్టీఆర్ తో పాట పాడించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. తాను చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అంటూ కేటగిరీస్ చేసుకుని చూడను. అన్నింటికి తన వల్ల అయ్యే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని దేవిశ్రీ తెలిపారు.

త్వరలో హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ
హీరోగా నటించమని అవకాశాలు కూడా వస్తున్నాయని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయని తెలిపారు.

దిల్ రాజు గారు, అశ్వినీ దత్ గారు, అల్లు అరవింద్ గారు, తమిళంలో థాను, జ్ఞానవేల్ రాజాగారు ఇలా చాలా మంది అడుగుతున్నారు. అయితే వింటున్న కథల్లో నాకు బాగా నచ్చితేనే చేయాలని ఉంది. మన ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి స్టార్స్ ఉన్నారు. హీరోగా నటించి ఏదో చేయాలని కాదు. మ్యూజిక్ షోలు ఇవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ ఏర్పడింది. నా బాడీ లాంగ్వేజ్ అందరికీ తెలుసు. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ వస్తే చేస్తాను. నా సినిమాలకు నేనే మ్యూజిక్ ఇస్తాను అన్నారు.

English summary
"After listening the romantic tune I has composed Pawan garu sent me a very big text message appreciating my work. I am overwhelmed by his gesture." DSP said.
Please Wait while comments are loading...