»   » రామానాయుడి మరణంపై పవన్, చిరు, కమల్ హాసన్ ఇలా...

రామానాయుడి మరణంపై పవన్, చిరు, కమల్ హాసన్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనారోగ్యంతో ఈ రోజు మధ్యాహ్నం మరణించిన ప్రముఖ నిర్మాత రామానాయుడు భౌతిక కాయాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మశాంతిచాలని ఆకాంక్షించారు.

చెన్నైలో కమల్ హాసన్ మాట్లాడుతూ...రామానాయుడు నుండి ఉంతో నేర్చుకున్నాను. భారతీయ సినిమా రంగానికి రామానాయుడు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అన్నారు. రామానాయుడు నుండి ప్రతి నిర్మాత ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పారు. రామానాయుడు లాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని తెలిపారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Pawan Kalyan, Chiru, Kamal Haasan about Ramanaidu death

కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ...సినీ రంగానికి ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, దర్వకులు, సంగీత దర్శకులు, లెక్కలేనంత మంది టెక్నీషియన్లను ఆయన పరిచయం చేసారని అన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ రామానాయుడు గారు ఏనాడు నన్ను పేరు పెట్టి పిలవలేదని, కలిసిన ప్రతిసారి రాజా అంటూ ఆప్యాయత చూపించేవారని గుర్తు చేసుకున్నారు. సినిమాయే లోకంగా ఆయన బ్రతికారన్నారు. అప్పట్లో నేను రిటైర్మెంట్ తీసుకోవాలని ఆయనకు సూచించాను. దానికి ఆయన స్పందిస్తూ...నేను సినిమాలు తీయడం మానేస్తే నా జీవం ఆగిపోయినట్లే అని ఆయన చెప్పినట్లు చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

English summary
Pawan Kalyan, Chiranjeevi, Kamal Haasan Pays Condolences To Ramanaidu.
Please Wait while comments are loading...