Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ ప్రేమకు నేనెప్పుడూ బానిసనే.. పవన్ కళ్యాణ్‌కు చేతులెత్తి దండం పెట్టిన బండ్ల గణేష్
పవన్ కళ్యాణ్‌పై సమయం సందర్భం లేకపోయితే ప్రశంసలతో ముంచెత్తుతుంటాడు బండ్ల గణేష్. అలాంటి పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ తాజాగా ఓ ట్వీట్ వేశాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిస్మస్ సందర్భంగా ఇండస్ట్రీలోని శ్రేయోభిలాషులకు గిఫ్ట్‌లను పంపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న స్పెషల్ గిఫ్ట్‌లను చూసి హీరోలు, నిర్మాతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికైతే మహేష్ బాబు, రానా, నితిన్, బండ్ల గణేష్‌లకు ఈ గిఫ్ట్‌లు చేరాయి.

మహేష్ బాబు ఫ్యామిలీకి...
మహేష్ బాబు దీపావళి సందర్భంగా ఇండస్ట్రీలోని తన శ్రేయోభిలాషులకు గిఫ్ట్‌లను పంపాడు. అనిల్ రావిపూడి, పరశురాం వంటి వారికి బహుమతులు వెళ్లాయి. అలాగే ఈ క్రిస్మస్‌కు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవ నుంచి స్పెషల్ బహుమతులు మహేష్ ఇంటికి చేరాయి. ఇలా సర్ ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ నమ్రత పోస్ట్ చేసింది.

రానా అలా..
అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు నటిస్తున్న రానాకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించాడు. ఈ గిఫ్ట్‌లను చూసిన రానా థ్రిల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ గారు అన్నాలకు థ్యాంక్స్.. గిఫ్ట్‌లు గ్రీటింగ్ పంపించింనందుకు థ్యాంక్స్ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

నితిన్ ఇలా..
పవన్ కళ్యాణ్ అభిమాని, భక్తుడు అని చెప్పుకునే నితిన్ గాల్లో తేలిపోయాడు. పవన్ కళ్యాణ్ నుంచి ఊహించని బహుమతులు రావడంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి గిఫ్ట్ రావడంతో ఈ క్రిస్మస్ ఎంతో గొప్పగా మారింది.. థ్యాంక్యూ సో మచ్ అన్నా అంటూ సంతోషాన్ని తెలియజేశాడు.

బానిసనే..
ఇక బండ్ల గణేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి చెప్పే మాటల గురించి ఎంత వివరించినా తక్కువే అవుతుంది. పవన్ కళ్యాణ్ నుంచి ఇలా గిఫ్ట్, గ్రీటింగ్స్ రావడంతో బండ్ల గణేష్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మీ ప్రేమకు నేనెప్పుడూ బానిసనే బాస్. పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ దండంపెట్టేశాడు.