పవన్ మీ నిర్ణయం సరికాదు.. చిరంజీవే గుర్తొస్తున్నారు.. వాళ్లిద్దరు కలిస్తే.. వినాయక్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్'. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో...
Recommended Video


పవన్‌కు ఓ రిక్వెస్ట్
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ మెగాఫ్యామిలీ అభిమానులకు థాంక్స్. పవన్‌కల్యాణ్ గారికి ఓ రిక్వెస్ట్. ఆయన సినిమాలు చేయనని అన్నారు. కానీ ఆయన రాజకీయంగా ఎంత ఎదిగినా, ప్రజా సమస్యలపై ఎంత పోరాడినా.. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేయండి అని సూచించారు.

ఇంటిలిజెంట్ సినిమా సూపర్
ఇంటిలిజెంట్ సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. సినిమాను చూసిన వారందరూ సంతోషిస్తారు. మంచి కథను అందించిన ఆకుల శివ, సినిమాటగ్రాఫర్ విశ్వేశ్వర్, ఎడిటర్ గౌతంరాజుగారు, గీతం అందించిన తమన్, సాహిత్యం అందించిన రచయితలు సహా అందరికీ థాంక్స్ అని వినాయక్ అన్నారు.

చిరంజీవి గుర్తుకు వచ్చారు
తేజుతో చమకు చమకు సాంగ్ చేసేటప్పుడు నాకు చిరంజీవిగారే గుర్తుకు వచ్చారు. అలాగే రెండు మూడు సన్నివేశాలు పవన్ కల్యాణ్‌లా తేజు కనపడేలా షూట్ చేశాను. ఎందుకంటే చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారు కలిస్తే ఎలా ఉంటుందో అలా తేజు స్టైల్ ఉంటుంది అని వినాయక్ తెలిపారు.

తేజు మెగా హీరో కావాలి
మెగా ఫ్యామిలీలో కష్టపడేతత్వం ఎలా ఉందో.. తేజులో ఆ తత్వం కనపడుతుంది. చిరంజీవిగారిలా తేజు అందరినీ కలుపుకు పోతుంటాడు. కాబట్టి తేజు కూడా అన్నయంత, పవన్‌కల్యాణ్‌గారంత పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను. మా అన్నయ్య, కల్యాణ్ నన్ను గాజు బొమ్మలా చూసుకున్నారు. నన్నెంతో బాగా కేర్ తీసుకున్నారు అని వినాయక్ వెల్లడించారు.

వంద సినిమాలు పూర్తికావాలి
ఇంటిలిజెంట్ సినిమా ఇంత త్వరగా పూర్తి కావడానికి నిర్మాతలే కారణం. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ వంద సినిమాలు పూర్తయ్యే వరకు నా జర్నీ వారితో ఉంటుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పట్నుంచి పెద్ద డైరెక్టర్‌ని అవుతానని నమ్మినవారిలో సీ కల్యాణ్ అన్నయ్య ఒకరు అని ఆయన గుర్తు చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











