»   » ఇంత పెద్దదైపోయిందా..?? పవన్ కల్యాణ్ తనయ ఆద్య ఫొటో

ఇంత పెద్దదైపోయిందా..?? పవన్ కల్యాణ్ తనయ ఆద్య ఫొటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెలబ్రెటీల సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో వారెలా ఉంటారనే విషయాన్ని తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉంటుంది. ఇక వాళ్ల పిల్లల ఫొటోలకీ ఎక్కడ లేని గిరాకి ఉంటుంది.తమ స్టార్ల పిల్లల ఫొటోలని చూసి మురిసిపోతూంటారు. ఇప్పటికే మహేష్ బాబూ, అల్లు అర్జున్ తమ ఫ్యాన్స్ పేజ్ లలో పిల్లల ఫొటోలని పోస్ట్ చేస్తూ ఉన్నారు కూడా. సరిగ్గా అలాంటి ఫోటోనే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ ఫోటో మరెవరిదో కాదు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ పిల్లల ఫోటో.

Pawan Kalyan Ex-Wife Renu Desai Diwali Celebrations Photos with Akiranandan and Aadhya
Pawan Kalyan Ex-Wife Renu Desai Diwali Celebrations Photos with Akiranandan and Aadhya

దివాళి సందర్భంగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కొడుకు అకీరా, ఆద్య ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ప్రత్యేకత ఏముందని కొట్టిపారేయకండి. పవన్ కొడుకు కూతుళ్లు మీడియా కంటపడటం చాలా తక్కవ. అకీరానందన్ ఫోటోలు అడపాదడపా నెట్‌లో హల్‌చల్ చేసినా కూతురు ఆద్య ఫోటోలు మాత్రం నెట్‌లో వెతికినా కనిపించవు. ఒకవేళ దొరికినా అవి ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో జరిగిన ఫంక్షన్‌లో దిగిన ఫోటోలు మాత్రమే. కానీ ఇప్పుడు ఆమె పెరిగి పెద్దదైంది. అకీరా కూడా టీనేజ్ వయసులోకి అడుగుపెట్టినట్లు ఫోటోలను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. పవన్ కూతురు అచ్చం తండ్రిలానే ఉందని అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Pawan Kalyan Ex-Wife Renu Desai Diwali Celebrations Photos with Akiranandan and Aadhya
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu