»   » పవన్ దయవల్లే, ఆయన దేవుడు, సర్దార్ చూస్తా: శ్రీజ

పవన్ దయవల్లే, ఆయన దేవుడు, సర్దార్ చూస్తా: శ్రీజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య పవన్ కళ్యాణ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న తన అభిమానిని శ్రీజను స్వయంగా కలిసి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆమె ఆపరేషన్ కోసం పవన్ ఆర్థిక సహాయం కూడా అందజేసారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతురాలై సంతోషంగా జీవిస్తోంది.

శ్రీజ కోలుకున్న తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ సినిమా కోసం ఆమె ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

అనారోగ్యంగా ఉన్నప్పుడు తన వద్దకు వచ్చి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్ శ్రీజ మరోసారి కృతఙ్ఞతలు తెలిపారు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగుందని, రేపు విడుదల కానున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించాలని తిరుమలను దర్శించుకున్నట్లు తెలిపారు.  రేపు తిరుపతిలోనే సినిమా చూస్తానన్నారు. శ్రీజ తండ్రి మాట్లాడుతూ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దయవల్లే తన కూతురు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిందని పేర్కొన్నారు.

తమ బిడ్డ ప్రాణాలు నిలిచేలా చేసిన పవన్ కల్యాణ్ తమకు దేవుడితో సమానమని, ఆ దేవుడే ఈ దేవుడి రూపంలో వచ్చాడన్నారు. అదేవిధంగా తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టినటువంటి డాక్టర్ కి, పవన్ కల్యాణ్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.

స్లైడ్ షోలో గతంలో పవణ్ కళ్యాణ్‌‌ను శ్రీజ కలిసిన ఫోటోస్...

శ్రీజ

శ్రీజ

శ్రీజ కోలుకున్న తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ సినిమా కోసం ఆమె ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

సర్దార్ చూస్తా

సర్దార్ చూస్తా

ఇప్పుడు తన ఆరోగ్యం బాగుందని, రేపు విడుదల కానున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని చూస్తానని చెప్పింది.

ఆయన దయవల్లే..

ఆయన దయవల్లే..


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దయవల్లే తన కూతురు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిందని పేర్కొన్నారు.

దేవుడు

దేవుడు

తమ బిడ్డ ప్రాణాలు నిలిచేలా చేసిన పవన్ కల్యాణ్ తమకు దేవుడితో సమానమని, ఆ దేవుడే ఈ దేవుడి రూపంలో వచ్చాడన్నారు.

English summary
Pawan Kalyan fan Srija Family press Meet about Sardar Gabbar singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu