twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చేదు నిజం: ఎక్కడ ఆ పూనకం?.. పవన్-త్రివిక్రమ్ 'మమా' అనిపించేశారా!..

    |

    బలవంతంగా తెచ్చిపెట్టుకున్న ఊపుతో ఎన్ని స్టెప్పులేసినా పెద్దగా కిక్ ఉండదు. పాటలో ఆ జోరు.. బాణీలో హుషారు ఉన్నప్పుడే బాడీ లాంగ్వేజ్ స్టెప్పులకు అనుగుణంగా మళ్లుతుంది. లేదంటే.. ఉసూరుమనిపించేయడం పక్కా.

    తాజాగా విడుదలైన అజ్ఞాతవాసి 'కొడుకా.. కోటేశ్వరరావు!..' విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సాంగ్ ఆశించిన స్థాయిలో లేదనే టాక్ వినిపిస్తోంది.

    దద్దరిల్లడం పక్కా: ఇప్పుడంతా 'కొడుకా.. కోటేశ్వరరావు' ఊపు.., పవన్ ఒక్కడే అందుకు అతీతం?దద్దరిల్లడం పక్కా: ఇప్పుడంతా 'కొడుకా.. కోటేశ్వరరావు' ఊపు.., పవన్ ఒక్కడే అందుకు అతీతం?

    కొడుకా కోటేశ్వరరావు వీడియో సాంగ్

    కొడుకా కోటేశ్వరరావు వీడియో సాంగ్

    త్రివిక్రమ్ కూడా పాటపై పెద్దగా కేర్ తీసుకోలేదా? అన్నట్లుగా ఉంది కొడుకా కోటేశ్వరరావు వీడియో సాంగ్. పిక్చరైజేషన్ మరీ వీక్ గా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. సాఫ్ట్ వేర్ కంపెనీ బ్యాక్ డ్రాప్ ను.. స్టూడియోలో పవన్ పాట పాడుతున్న సన్నివేశాలను మిక్స్ చేసి వీడియోలో పెట్టారు. నూతన సంవత్సర కానుకగా విడుదల చేసిన పాట డిసపాయింట్ చేసిందనే వార్తలు మీడియాలో కనిపించడం గమనార్హం.

     పిక్చరైజేషన్ 'వీక్'..:

    పిక్చరైజేషన్ 'వీక్'..:

    త్రివిక్రమ్ కూడా పాటపై పెద్దగా కేర్ తీసుకోలేదా? అన్నట్లుగా ఉంది కొడుకా కోటేశ్వరరావు వీడియో సాంగ్. పిక్చరైజేషన్ మరీ వీక్ గా అనిపిస్తుందనడంలో సందేహం లేదు. సాఫ్ట్ వేర్ కంపెనీ బ్యాక్ డ్రాప్ ను.. స్టూడియోలో పవన్ పాట పాడుతున్న సన్నివేశాలను మిక్స్ చేసి వీడియోలో పెట్టారు. కానీ.. అంతా ఓ అతుకుల బొంతలా.. పెద్దగా ఆకట్టుకోలేని రీతిలో ఉంది.

     ఎత్తుకోవడమే.. నీరసంగా:

    ఎత్తుకోవడమే.. నీరసంగా:

    'కొడుకా.. కోటేశ్వరరావు..' అంటూ పవన్ పాట ఎత్తుకోవడంలోనే ఒకరకమైన నీరసం కనిపించింది. 'కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా' అంటూ సాగిన జోష్ కోటేశ్వరరావులో లేదనే వాదన వినిపిస్తోంది.

    ‘కొడకా కోటేశ్వర్ రావు' సాంగ్ అదుర్స్: న్యూ ఇయర్ వేడుకల్లో మార్మోగుతున్న పవర్ సాంగ్!‘కొడకా కోటేశ్వర్ రావు' సాంగ్ అదుర్స్: న్యూ ఇయర్ వేడుకల్లో మార్మోగుతున్న పవర్ సాంగ్!

     అనిరుధ్ ఇలా చేశాడేంటి?:

    అనిరుధ్ ఇలా చేశాడేంటి?:

    గతంలో కొలవెరీ లాంటి మాస్ సాంగ్ తో ఊపు ఊపిన అనిరుధ్.. కొడుకా కోటేశ్వరరావుకు అంత బలమైన బాణీ అందించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 'ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ మొత్తానికి కొడుకా కోటేశ్వరరావుతో ఏదో 'మమా' అనిపించేశారంతే..' అన్న ఫీలింగ్ కలిగించారు.

     ఎవరీ శర్మ:

    ఎవరీ శర్మ:

    ఇక పాటలో శర్మగారూ...శర్మగారూ అంటూ పవన్ ఒకటి కి రెండు సార్లు పలకడం, తన స్థాయికి తగ్గ సంగీత దర్శకుడే లేరా? అని అడగడం చూస్తుంటే.. సినిమాలో ఈ శర్మ క్యారెక్టర్ ఎవరా? అన్న సందేహం కలుగుతుంది. అయితే సినిమాలో 'మురళీ శర్మ' పాత్రను ఉద్దేశించే ఇది సెట్ చేశారని అంటున్నారు.

    అభిమానులకు మనసొప్పదు..

    అభిమానులకు మనసొప్పదు..

    పవన్ కల్యాణ్‌కు సంబంధించి ఏ విషయమైనా నెగటివ్ కామెంట్ చేయడానికి ఆయన అభిమానులకు మనసొప్పదు. నిజంగా బాగా లేకున్నా సరే!.. ఎదుటివాళ్లు ఆ మాటంటే తట్టుకోలేరు. వాళ్ల అభిమానం అలాంటిది. అంతలా ఆరాధించే అభిమానులను త్రివిక్రమ్-పవన్ ఇద్దరూ ఈ పాటతో కాస్త డిసప్పాయింట్ చేశారనే చెప్పాలి. ఈ చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

    English summary
    'Koduka..' song was released from Power Star Pawan Kalyan much-awaited movie 'Agnyaathavasi'. But the song is not reached the expectations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X