twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    YCP నేతల ఆదాయం మూడు రెట్లు పెరిగితే.. ఉద్యోగుల జీతం 30 శాతం కోత.. జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఫైర్

    |

    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఏపీ ఉద్యోగుల మధ్య చోటుచేసుకొన్న ప్రతిష్టంభన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉద్యోగుల జీతాల్లో కోతపెడుతూ జీవోలు జారీ చేయడంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఛలో విజయవాడ పేరిట కదం తొక్కారు. విజయవాడ రోడ్లని ఉద్యోగులతో కిటకిటలాడాయి. లక్షలాది మంది తరలిరావడం రికార్డుగా మారింది. ఛలో విజయవాడ కార్యక్రమంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ..

    ఉద్యోగులు రోడ్లపైకి రావడం బాధాకరం

    ఉద్యోగులు రోడ్లపైకి రావడం బాధాకరం

    పవన్ కల్యాణ్ విడుదల చేసిన వీడియోలో.. ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం బాధ కలిగించింది. ఉద్యోగాలు చేసుకొనే టీచర్లు గానీ, ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించాల్సిన ఉద్యోగులు కానీ, ప్రజల అవసరాలు తీర్చాలని వారు ఈ రోజు రోడ్లపైకి రావడం మరీ బాధకారం. పెంచామంటూ ఉద్యోగుల జీతాలపై 5 నుంచి 8 వేల రూపాయలు కోత పెట్టిన విధానం, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చి ఆందోళన తెలపడం బాధ కలిగించింది అని పవన్ కల్యాణ్ అన్నారు.

    పేద, మధ్య తరగతి ఉద్యోగులు జీవితాలు

    పేద, మధ్య తరగతి ఉద్యోగులు జీవితాలు


    నేను ఓ ప్రభుత్వ ఉద్యోగిని. ఉద్యోగులకు సంబంధించి డీఏలు, జీతాల పెంపు కోసం ఆసక్తిగా చూస్తూ.. జీతాలు పెరిగితే పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతాయని అనుకొంటారు. పేద, మధ్య తరగతి ఉద్యోగుల బడ్జెట్ ప్లానింగ్ ఎలా ఉంటుందో తెలిసిన వాడిని అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

    అధికారంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత

    అధికారంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత

    ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని అన్నారు. ప్రస్తుతానికి దానిపై ఊసే లేదు. మా ప్రభుత్వం వస్తే.. అద్భుతంగా జీతాలు పెంచుతామని హామీలు ఇచ్చారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకుండా, జీతాలు పెంచామని చెప్పి.. జీతాల్లో కోత పెట్టడం వారిని మోసం చేయడమే అవుతుంది అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

    ఉద్యోగులకు ఆసరగా ఉందామని..

    ఉద్యోగులకు ఆసరగా ఉందామని..

    ఏపీ ప్రభుత్వం జీతాలు తగ్గించిన వివాదంపై ఉద్యోగులతో చర్చలు జరుపాలని అనుకొన్నాం. కానీ ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ జగన్ సర్కార్‌తో చర్చలు జరుపుతాం. వేరే రాజకీయ పార్టీల సహకారం అవసరం లేదని చెప్పడంతో మేము చర్చలకు వెనుకంజ వేశాం. ఉద్యోగులు అడిగితే సహకారం అందిద్దామని అనుకొన్నాం. మా పార్టీలో కూడా చర్చ జరిపాం. కానీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడం, ఉద్యోగులందరూ రోడ్లపైకి రావడం బాధ కలిగించింది. అందుకే నేను నా పరిధిలో స్పందిస్తున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

    Recommended Video

    Devineni Director Sensational Comments On Vijayawada Leaders | Filmibeat Telugu
    వైసీపీ నేతల ఆదాయం భారీగా పెరిగి

    వైసీపీ నేతల ఆదాయం భారీగా పెరిగి

    వైసీపీ నేతల ఆదాయం భారీగా పెరిగి.. జీతాలు భారీగా కోత
    వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఘాటైన విమర్శలు చేశారు. అధికారంలోకి రాకముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట. ఆ రోజు పొరపాటున ఆ మాటలు అన్నామని చెప్పడం నమ్మశక్యంగా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వైసీపీ రాజకీయ నాయకులు ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 30 శాతం తగ్గాయి. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించి మోసం చేసింది అని పవన్ కల్యాణ్ అన్నారు.

    English summary
    Pawan Kalyan fires on YS Jagan's AP Government over Chalo Vijayawada. Jana Sena Cheif made sensational allegation over PRC annonced by AP Government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X