twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan Kalyan మహిళలు భోగ వస్తువులా? అంగడి సరుకా? మూడు పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్‌కు నోటీసులు

    |

    ఉత్తరాంధ్రలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు వైజాగ్‌లో అడుగుపెట్టిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను స్థానిక పోలీసులు అడ్డుకొన్న తీరు వివాదాస్పదంగా మారింది. పోలీసుల అంక్షల నేపథ్యంలో రెండు రోజులపాటు పవన్ కల్యాణ్ వైజాగ్‌లోని నోవాటెల్ హోటల్‌కే పరిమితం అయ్యారు. ఈ వివాదాస్పద అంశం నేపథ్యంలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. తన మూడు పెళ్లిళ్లపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ నేత. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కేసు నమోదు చేయడమే కాకుండా నోటీసులు జారీ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

    నోవాటెల్ హెటల్‌లో పవన్ కల్యాణ్

    నోవాటెల్ హెటల్‌లో పవన్ కల్యాణ్

    నోవాటెల్‌లో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు తన మూడు పెళ్లిళ్లపై అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నా జీవితంలో వైవాహిక బంధం విషయంలో కుదర్లేదు. చట్టబద్దంగా విడాకులు తీసుకోవడమే కాకుండా భరణం చెల్లించి వివాహాన్ని రద్దు చేసుకొన్నాం. మీకు ఇష్టమైతే మూడు కాదు.. నాలుగు చేసుకోవచ్చు. నాకు మీలా ఒక భార్యతో కాపురం చేస్తూ.. స్టెప్నీలను మెయింటెన్ చేయడం రాదు అని పవన్ కల్యాణ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

    మూడు పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్ కామెంట్స్

    మూడు పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్ కామెంట్స్

    అయితే మూడు పెళ్లిళ్ల వ్యవహారంపై పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు అభ్యంతరకరం. మహిళలను కించపరిచినట్టు ఆయన మాట్లాడారు. మహిళలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. మహిళల మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన ఆయన బేషరుతగా క్షమాపణ చెప్పాలి అని ఏపీ మహిళా కమిషన్ సుమోటగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటూ నోటీసులు జారీ చేసింది.

    భరణం ఇస్తే భార్యను వదులుకోవచ్చా?

    పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ తరుఫున వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేస్తూ.. మీరు ఇటీవల మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో దుమారం రేపాయి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే విధంగా మాట్లాడిన మాటలు మహిళాలోకాన్ని షాక్‌కు గురిచేసింది. మీ మాటల్లోని తప్పును తెలుసుకొని మహిళాలోకానికి మీరు వెంటనే సంజాయిషీ ఇస్తారని మహిళా కమిషన్ భావించింది. అయితే మీ నుంచి ఎలాంటి పశ్చత్తాపం కనిపించలేదు. మహిళల ఆత్మగౌరవం దెబ్బ తీసినందుకు మీ నుంచి క్షమాపణలు లేవు అని వాసిరెడ్డి పద్మ తన నోటీసుల్లో పేర్కొన్నారు.

    సమాజంపై మీ మాటల ప్రభావం

    సమాజంపై మీ మాటల ప్రభావం

    ఎవరైనా సరే మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే.. అది ఖచ్చితంగా వ్యతిరక అంశమే. కోట్ల రూపాయలు భరణం చెల్లించి విడాకులు తీసుకొన్నాను. మూడు పెళ్లిళ్లు చేసుకొన్నాన. చేతనైతే మీరూ చేసుకోండి అనడం అభ్యంతరకరం. కోట్లు, లక్షలు చెల్లిస్తూ భార్యను వదిలించుకొంటూ పోతే.. ఏ మహిళ జీవితానికైనా భద్రత ఉంటుందా? ఒక హీరోగా, రాష్ట్రంలో ఓ పార్టీ అధ్యక్షుడిగా మీరు మూడు పెళ్లిళ్లపై మాట్లాడిన మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని విషయం మీకు తెలియదా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నలను సంధించారు.

    మీ అభిమానులు ఆచరించే ప్రమాదం

    మీ అభిమానులు ఆచరించే ప్రమాదం

    మీరు మాట్లాడిన మాటలు మీ అభిమానుల ప్రభావితం కారా? మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకొవచ్చు అనే అభిప్రాయాన్ని తలకెక్కుకోరా? మీ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి స్టేప్నీ అనే పదం ఉపయోగించడం తీవ్ర అక్షేపణీయం. మహిళలను భోగ వస్తువులుగా చూస్తారా? ఆడవాళ్లు అంగడి వస్తువుగా చూసే వారే ఇలాంటి పదాలను ఉపయోగిస్తారు అని వాసిరెడ్డి పద్మ తన నోటీసుల్లో పేర్కొన్నారు.

    మహిళలకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి

    మహిళలకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి

    మీ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మంది మహిళలు మాకు ఫిర్యాదు చేశారు. మీ మాటలు అవమానకరంగా మహిళల భద్రతకు పెను ప్రమాదంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు, అలాగే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడంపై మీరు తక్షణమే మహిళలకు సమాధానం క్షమాపణ చెప్పాలి. మీ వ్యాఖ్యలను వెనుక్క తీసుకోవాలి అని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ మీకు నోటీసులు జారీ చేస్తున్నది అని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

    English summary
    Pawan Kalyan gets notices from AP Women Commission over Three Marriage and Stepny comment at Vizag's Novatel Hotel. Chairperson Vasireddy Padma demands apology over pawan kalyan's Stepny comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X