»   » పవన్ కళ్యాణ్ పెద్ద ప్లాప్, మోసగాడు కూడా...బాలీవుడ్ క్రిటిక్ సంచలనం!

పవన్ కళ్యాణ్ పెద్ద ప్లాప్, మోసగాడు కూడా...బాలీవుడ్ క్రిటిక్ సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కమాల్ రషీద్ ఖాన్(కెఆర్‍‌కె)... పేరు గుర్తుందా? గతంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' రిలీజ్ సమయంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేసిన చేసిన ఇతగాడు తాజాగా 'కాటమరాయుడు' రిలీజ్ వేళ మరోసారి పవర్ స్టార్ మీద వివాదాస్పద కామెంట్స్ చేసాడు.

పవన్ కళ్యాణ్ ఇమేజ్ కావాలని డ్యామేజ్ చేయాలనే

పవన్ కళ్యాణ్ ఇమేజ్ కావాలని డ్యామేజ్ చేయాలనే

బాలీవుడ్ నటుడు, క్రిటిక్, నిర్మాత అయిన కెఆర్‌కె ట్వీట్స్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కావాలని డ్యామేజ్ చేయాలనే కసితో చేసినట్లు కనిపిస్తోంది. తన ట్వీట్ల ద్వారా పవన్ కళ్యాణ్ ను ఒక మోసగాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడు. మరి ఇతడికి

ప్లాప్ స్టార్, మోసగాడు అంటూ

తెలుగు యాక్టర్ పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ప్లాప్ హీరో..... ఇపుడు పెద్ద మోసగాడు కూడా అయిపోయాడు అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్లో ట్వీట్స్ చేసాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని, డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్‌ను పవన్ కళ్యాణ్ రూ.8 కోట్లకు మోసం చేస్తున్నాడని కెఆర్‌కె సంచలన ట్వీట్ చేసారు.

7 రోజులుగా నిరాహార దీక్ష

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న నిరాహార దీక్ష ఫొటోను తన ట్విట్టర్‌లో షేర్ చేసిన .. ‘‘ఓ ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా వల్ల రూ.2 కోట్లు నష్టపోయాడు. ఆ సినిమా పెద్ద ప్లాప్. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు'' అని కెఆర్‍‌కె ట్వీట్ చేసారు.

పవన్ కళ్యాణ్ సినిమా బాధితుల నిరాహార దీక్ష

పవన్ కళ్యాణ్ సినిమా బాధితుల నిరాహార దీక్ష

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ద్వారా నష్టపోయిన పంపినీ దారులు ఇటీవల నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ సినిమా వల్ల కోట్లు నష్టపోయిన తమను కాటమరాయుడు రైట్స్ ఇవ్వడం ద్వారా ఆదుకుంటామని మాట ఇచ్చి...ఇపుడు మాట తప్పారని, తమకు తగిన న్యాయం చేయాలని కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ రోడ్డుపై టెంటు వేసుకుని దీక్ష ప్రారంభించారు. అయితే పోలీసులు అతడి దీక్ష భగ్నం చేసారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"Telugu actor Pawan Kalyan was a big flop, but now he has become a big cheater also. So he is cheating distributor Dileep Tondon for ₹8Cr." kamaal r khan tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu