»   » సైలెంటుగా వచ్చి...హెల్ప్ చేసి వెళ్లిన పవన్ కళ్యాణ్

సైలెంటుగా వచ్చి...హెల్ప్ చేసి వెళ్లిన పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత మంచి మనసున్న వాడో ఇపుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి అడగకుండానే సహాయం చేసారాయన. సహాయం చేయడమే తప్ప పబ్లిసిటీ ఆశించని వ్యక్తిత్వం ఆయనది. తాజాగా పవర్ స్టార్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

ఓ అమ్మాయికి కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం సహాయం కావాలని పేపర్లో యాడ్ చూసిన పవన్ వెంటనే స్పందించారు. మంగళవారం కేపీహెచ్‌పి కాలనీలోని ఓ ఆసుపత్రికి చేరుకుని రూ. 2 లక్షల చెక్కు అందించి వెళ్లి పోయారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎలాంటి హడావుడి లేకుండా సైలెంటుగా వచ్చి వెళ్లి పోయారు పవన్. అభిమానుల ద్వారా ఈ విషయం బయటకు తెలిసింది. పవన్ కళ్యాణ్ సహాయం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

పవన్ కళ్యాణ్ సినిమాల వివరాల్లోకి వెళ్లితే...ఆయన నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం పెద్ద విజయం సాధించి తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 85 కోట్లకు పైగా వసూలు చేసిన ఈచిత్రం త్వరలోనే రూ. 100 కోట్ల మార్కును అందుకోబోతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాన్ 'గబ్బర్ సింగ్-2' చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన తేదీనే అంటే...మే 11, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు.

English summary
Pawan Kalyan helped a small girl from Kukatpally who was suffering from kidney problem. He gave the girl's parents 2 Lakhs and motivated the girl's parents.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu