»   » ఆ హీరోను చూస్తే అసహ్యం వేస్తున్నది.. సిగ్గుతో చస్తున్నా.. పవన్ కల్యాణ్ హీరోయిన్ ఫైర్

ఆ హీరోను చూస్తే అసహ్యం వేస్తున్నది.. సిగ్గుతో చస్తున్నా.. పవన్ కల్యాణ్ హీరోయిన్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ తెలుగు సినిమా హీరోపై టాలీవుడ్ హీరోయిన్ నికీషా పటేల్ విరుచుకుపడింది. అతడి పేరు ఎత్తడానికే మనసు ఒప్పడం లేదని ఆమె ట్విట్టర్‌లో దుమ్మెత్తి పోసింది. గతంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సరసన కొమురం పులి సినిమాలో నికీషా పటేల్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. అప్పుడప్పుడు తరచుగా మీడియాలో కనిపించే ఆమె తాజాగా ట్విట్టర్‌లో ఓ హీరోపై సెన్సేషనల్ కామెంట్ చేయడం ద్వారా మీడియాను మరోసారి ఆకర్షించింది.

బాహుబలిని చూశావా...

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరు బాహుబలి చూశావా లేక చూడకపోతే ఎప్పుడు చూస్తావు అని అడగడం సర్వసాధారణంగా మారింది. ఆ నేపథ్యంలోనే ఓ హీరోతో బాహుబలి2 సినిమా చూశావా అని నికీషా అడిగిందట. అందుకు ఆయన ఇచ్చిన సమాధానంతో చిర్రెత్తుకొచ్చిందని నికీషా ఆగ్రహం వ్యక్తం చేసింది.

దర్శకుడు ఎవరు అని ప్రశ్నించాడు..

నేను ఇటీవల ఓ హీరోను బాహుబలి2 చిత్రం చూశావా అని అడిగాను. అందుకు ఆయన నిర్లక్ష్యంగా ఆ సినిమా దర్శకుడు ఎవరు అని నన్ను ప్రశ్నించాడు. దాంతో ఆశ్చర్యపోవడం నా వంతు అయింది అని నికీషా ట్విట్టర్‌లో పేర్కొన్నది. టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిన సినిమా గురించి అతను అలా మాట్లాడటాన్ని ఆమె తప్పుపట్టింది.

అంత నిర్లక్ష్యమా..

అంత నిర్లక్ష్యమా..

ఆ హీరో అలా చెప్పడం ఆయనలో ఉన్న అసూయ, ద్వేషభావం అద్దం పట్టింది. చరిత్ర సృష్టించిన సినిమా గురించి అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతాడా అని ప్రశ్నించింది. ఆ హీరో పేరు పలుకడానికి కూడా నాకు అసహ్యం వేస్తున్నది నికీషా ఆవేదన వ్యక్తం చేసింది. నిన్ను చూసి సిగ్గుతో తలవచ్చుకొంటున్నాను అని ఆమె తెలిపింది.

ఆ హీరో ఎవరు..

ఆ హీరో ఎవరు..

బాహుబలి2 సృష్టిస్తున్న ప్రభంజనం, కలెక్షన్ల జైత్రయాత్రను చూసి ప్రముఖ దర్శకులు శేఖర్ కపూర్, రాంగోపాల్ వర్మ, హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, రాంచరణ్ లాంటి వారు ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా నికీషా ట్వీట్లతో బాహుబలిపై అసూయ పడుతున్న హీరో ఎవరు అనే చర్చ ఒక్కసారిగా ప్రారంభమైంది. నికీషా సన్నిహితులను కొందరు అడిగి తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.

English summary
Tollywood actor Nikesha Patel fires on a Telugu Hero. She Tweeted that.. I asked one telugu actor "have you watched baahubali replied "who directed that?"How ignorant and stupid and artificial are you..shame on u. Nikesha acted with Pawan Kalyan in Komuram Puli.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu