»   » ‘రాజులైనా, బంటులైనా.. కూలి అయినా, యాపారులైనా..’అంటూ పవన్ ..దుమ్ము రేపాడు

‘రాజులైనా, బంటులైనా.. కూలి అయినా, యాపారులైనా..’అంటూ పవన్ ..దుమ్ము రేపాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడులోని పాటలను వరస పెట్టి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అదే పాటలో మూడో పాటతో 'కాటమరాయుడు' వచ్చాడు 'రాజులైనా, బంటులైనా.. కూలి అయినా, యాపారులైనా..' అని సాగే ఈ పాట మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఆ పాటను మీరు ఇక్కడ వినవచ్చు.


అనూప్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మూడో సాంగ్‌ను రేడియో మిర్చి 98.3లో విడుద‌ల చేశారు. జివ్వు జివ్వు అగునా...అంటూ ప‌ల్ల‌వితో సాగే ఈ పాట విడుద‌ల కార్య‌క్ర‌మంలో సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌, సాంగ్‌కు సాహిత్యాన్ని అందించిన వ‌రికుప్ప‌ల యాద‌గిరి పాల్గొన్నారు.పవన్ కు ధాంక్స్

పవన్ కు ధాంక్స్

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ మాట్లాడుతూ - ```కాట‌మ‌రాయుడు`లో మొద‌టి రెండు పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించే అవ‌కాశం క‌లిగించిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి థాంక్స్‌. ప‌వ‌న్‌సార్‌తో ఇది నాకు రెండో సినిమా.


ఫోన్ లో ఇచ్చిన మాటను.

ఫోన్ లో ఇచ్చిన మాటను.

`గోపాల గోపాల` సినిమాలో `భాజే భాజే...`సాంగ్ విన‌గానే ప‌వ‌న్‌గారు నాకు ఫోన్ చేసి అనూప్ మ‌నం మ‌రోసారి క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని అన్నారు. అప్పుడు ఫోన్‌లో ఇచ్చిన మాట‌ను `కాట‌మ‌రాయుడు` సినిమాతో పూర్తి చేశారు. ఈ విష‌యం ద్వారా ఆయ‌న మాట ఇస్తే పూర్తి చేస్తార‌ని నాకు ప‌ర్స‌న‌ల్‌గా తెలిసింది అన్నారు అనూప్.


సాంగ్ అందరికీ నచ్చేలా...

సాంగ్ అందరికీ నచ్చేలా...

పవన్ సార్ అందించిన స‌పోర్ట్‌కు థాంక్స్‌. ఈ జివ్వు జివ్వు అనే సాంగ్‌ను ప‌వ‌ర్‌స్టార్‌గారి ఫ్యాన్స్ కోసం చేశాం. అందరికీ ఈ సాంగ్ కూడా న‌చ్చేలా ఉంటుంది`` అన్నారు అనూప్ రూబెన్స్.


మాస్..పోక్

మాస్..పోక్

పాట‌ల ర‌చ‌యిత వ‌రికుప్ప‌ల యాద‌గిరి మాట్లాడుతూ - ``నేను కూడా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి పెద్ద అభిమానిని. ఈరోజు ఆయ‌న న‌టించిన `కాట‌మ‌రాయుడు` సినిమాలో పాట రాయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. `జివ్వు జివ్వు ..` అనే ఈ సాంగ్ అభిమానుల‌కు, ప్రేక్ష‌కులకు న‌చ్చే మాస్ - ఫోక్ సాంగ్‌. ఈ అవ‌కాశం ఇచ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి, శ‌ర‌త్‌మ‌రార్‌గారికి, డైరెక్ట‌ర్ డాలీగారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌గారికి థాంక్స్‌``అన్నారు.


ఆనందంగా ఉంది

ఆనందంగా ఉంది

ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య గుప్తా మాట్లాడుతూ - `` మా సంస్థ‌లో దాదాపు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారు న‌టించిన దాదాపు అన్ని సినిమాల పాట‌ల‌ను విడుద‌ల చేశాం. అన్నింటికి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చాయి. అలాగే ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ లెటెస్ట్ మూవీ`కాట‌మ‌రాయుడు` పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. అల్రెడి విడుద‌లైన రెండు పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. అందులో టైటిల్ సాంగ్ `మిరా మిరా మీసం...` కు నాలుగు మిలియ‌న్ వ్యూస్‌, రెండు లక్ష‌ల లైక్స్ వ‌చ్చాయి. అలాగే సెకండ్ సాంగ్ `లాగే లాగే...`రెండు మిలియ‌న్ వ్యూస్‌కు ద‌గ్గ‌ర‌లో ఉంది.


మాస్ మాసాలా

మాస్ మాసాలా

ఈరోజు హోలీ పండుగ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకుని వ‌రికుప్ప‌ల యాద‌గిరి రాసిన మాస్ ఫోక్ సాంగ్ ` జివ్వు జివ్వు ..` అనే సాంగ్‌ను రేడియో మిర్చిలో విడుద‌ల చేశాం. ఈ ప‌క్కా మాస్ మ‌సాలా సాంగ్ ఇటు అభిమానులు, ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. మిగిలిన పాట‌ల‌ను రెండు రోజులకు ఒకొక్క పాట‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశాం. ఫుల్ ఆల్బ‌మ్‌ను మార్చి 18న జ‌ర‌గ‌బోయే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో విడుద‌ల చేస్తాం.


అభిమానుల నుంచి ..

అభిమానుల నుంచి ..


విడుద‌ల చేసిన జివ్వు జివ్వు...సాంగ్ విడుద‌ల‌ను ఆదిత్య మ్యూజిక్ అఫిసియ‌ల్ ఫేస్ బుక్ పేజ్ ద్వారా లైవ్ అంద‌జేశాం. దీనికి ఆడియెన్స్ నుండి, అభిమానుల మంచి స్పంద‌న వ‌చ్చింది. కాట‌మ‌రాయుడు పాట‌ల‌న్నీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అలాగే కాట‌మ‌రాయుడు పాటలు అఫిసియ‌ల్ ఆదిత్య యూ ట్యూబ్ ఛానెల్‌, యాపిల్ మ్యూజిక్‌, ఐ ట్యూన్స్‌, సావ‌న్‌లో అందు బాటులో ఉన్నాయి. కాట‌మ‌రాయుడు ఆడియో విడుద‌ల చేసే అవ‌కాశం ఇచ్చిన ప‌వ‌ర్‌స్టార్ ఫ‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి, నిర్మాత శ‌ర‌త్ మరార్‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు.


rn

పిచ్చగా నచ్చేసింది

ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన చిత్రంలోని తొలి సాంగ్ మిర మిర మీసం పాటని ఆ మధ్యన గా విడుదల చేయగా, ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'లాగే మనసు లాగే ...నీ వైపే నను లాగే ...ఊగే మనసు ఊగే.. నీ కోసం తనువూగే ...నీ నవ్వులోన ఉందే ఓ మైకం...నీ మాటలోనా ఉందే ఓ రాగం' అంటూ వచ్చిన పాట కూడా ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఆ పాటను మీరు ఇక్కడ వినవచ్చు.


rn

శ్రీకారం చుడతారు

పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూనే మార్చి 18న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించనున్నారు. ఈ వరుస విశేషాలతో మార్చి నెల మొత్తం పవన్ అభిమానులకు పండుగలా మారనుంది. ఈ పాట‌తోనే ప్ర‌మోష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ప్ర‌తీ రెండు రోజుల‌కూ ఓ పాట‌గానీ, మేకింగ్ వీడియో గానీ విడుద‌ల చేస్తున్నారు.


మరో రెండు బిట్ సాంగ్స్

మరో రెండు బిట్ సాంగ్స్

ముఖ్యంగా కాటమరాయుడు చిత్రం మాస్ సినిమా లాకాకుండా... . ఇదొక మ్యూజికల్ సినిమా గా ప్రెజెంట్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ఈ సినిమాలో కేవలం ఆరు పాటలే కాకుండా.. సినిమాలో మరో మూడు బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయని రివీల్ చేసారాయన.


rn

పవన్ కెరీర్ లో నే

మరో ప్రక్క ఈ చిత్రం టీజర్‌ అరుదైన మైలురాయిని దాటింది. ఫిబ్రవరి 4న యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్‌ ఆదివారానికి కోటి వ్యూస్‌ను క్రాస్‌ చేయగా, 2.52 లక్షల మంది లైక్‌లు పొందింది. పవన్‌కల్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గా ఇది నిలిచినట్లు సమాచారం


ఇదీ టీమ్

ఇదీ టీమ్

ఫ్యాక్షనిస్టు ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని


English summary
Pawan Kalyan’s ‘Katamarayudu’ team has been releasing songs one by one on to the youtube. Makers have released the Katamarayudu Movie third song ‘Jivvu Jivvu’. The official twitter account of Northstar Entertainment has tweeted,” The third single from the movie #Katamarayudu #JivvuJivvu is to be launched at Radio Mirchi 98.3 FM Today.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu