»   » ఇవేం మనోభావాలు సామీ..! లడ్డూ వ్యాఖ్యకి కూడా పవన్ వివరణ ఇవ్వాలా

ఇవేం మనోభావాలు సామీ..! లడ్డూ వ్యాఖ్యకి కూడా పవన్ వివరణ ఇవ్వాలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య ఎవరి మనోభావాలు ఎప్పుడు, ఎందుకు, ఎలా దెబ్బతింటున్నాయో అర్థం కావటం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఈ మధ్య లడ్డూ వ్యాపారుల మనోభావాలని దెబ్బతీసాడంటూ చిన్న కలకలం రేగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేశ్ బచావో పేరుతో ఓ పాటల ఆల్బమ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

పవన్ సినిమాలోని కొన్ని పాటలను, బహిరంగ సభల్లోని కొన్ని డైలాగ్స్‌ను మిక్స్ చేసి డీజే పృథ్వీ అనే కుర్రాడు. "దేశ్ బచావో" పేరుతో ఒక ఆల్బమ్‌ను రూపొందించారు. ఈ పాటల్లోని ఓ పాటలో పవన్ లడ్డూ అంటూ చెప్పే డైలాగ్ పదేపదే వినిపిస్తోంది. కాకినాడ లో జరిగిన జనసేన సభలో మాట్లాడిన పవన్ "టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం.. ఇస్తాం.. ఇస్తాం అంటూ మూడు సంవత్సరాల తరువాత పాచిపోయిన లడ్డూ ఇస్తారా.. పాచిపోయిన లడ్డూలను టీడీపీ స్వీకరిస్తుందా అంటూ అడిగాడు.

 Pawan kalyan & Laddu controversy

అంతేకాదు ఆంధ్రాకు వచ్చి ఆంధ్రానే విడగొడతారా.. అంటూ గట్టిగానే విమర్శించాడు. అయితే అవి కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ ఎంత గుచ్చుకున్నయో తెలీదు గానీ కొందరికి మాత్రం భలంగానే తగిలాయట. అంత బలంగా తాకాక ఇంకేముందీ మనో భావాలు గాయపడ్డాయి.. అంతే ఈ పాచిపోయిన లడ్డూ పాటపై వివాదం రాజుకుంది. పవన్ ప్రతీ సందర్భంలో పాచిపోయిన లడ్డూలని అంటున్నారని, పాటలో కూడా లడ్డూ అంటూ అవమానపరిచే విధంగా ఉందని కొందరు పవన్‌పై మండిపడ్డారట.

ఈ మండిపడ్డ విషయం పవన్ చెవిన కూడా పడటం తో " పాచిపోయిన లడ్డూ కే గానీ, లడ్డూకి వ్యతిరేకం కాదని చెప్పలనుకున్న పవన్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఈ విషయంపై పవన్ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. తనకు లడ్డూల మీద కాని, అవి అమ్మే వ్యాపారుల మీద కాని, వాటిని తినే వారి మీద కాని ఎలాంటి చులకన భావం లేదని జనసేన మనవి చేసుకుంటుందని పవన్ ట్వీట్ చేశారు.

కానీ అడక్కుండా చేతిలో పాచిపోయిన లడ్డూలు పెట్టేవారి మీదే మాకున్న అసహనమంతా అని గుర్తించాలని పవన్ తెలిపాడు. అంతేకాదు, లడ్డు తినడం ఆరోగ్యానికి హానికరం కాదు అంటూ పవన్ ట్వీట్ చేయడం విశేషం. దీంతో గాయపడ్డ మనోభావాలు మళ్ళీ కోలుకుంటున్నాయట. అదీ మరి సంగతి. అందుకే మాట్లాడే టప్పుడు ప్రతీ పదాన్నీ ఆచీ తూచీ వాడాలన్న మాట .

English summary
Janasena Founder, Pwerstar Pawan kalyan gave Clarification on His PACHIPOYINA LADDU comment at Kakinada Meeting
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu